నిజంగా సిగ్గూశరం ఉంటే మాత్రం…ఆ పోలీస్ సంఘం మహిళా నేత హెచ్చరికలు, తిట్లకు ఎవరైనా ఉరి వేసుకోవాల్సిందే. కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాంటి పోలీస్‌లా ఉంది ఆమె. పవర్‌ఫుల్ లేడీ పోలీస్ పేరు స్వర్ణలత. ఏపీ స్టేట్ పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా స్వర్ణలత శక్తిమంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.
పోలీసులపై అవాకులు చెవాకులు పేలిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఆ పోలీస్ సంఘం మహిళా నేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె మాటలు వింటే అయ్యన్నపాత్రుడు అవమానంతో ఏం కావాలనే ఆందోళన కలగకమానదు.
ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనడం…ఆమెకు కోపం తెప్పించింది. దీనికి తీవ్రస్థాయిలో ఆమె రియాక్ట్ అయ్యారు.
“రాజకీయాల్లో ఎంతో అనుభవముందని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి రాజకీయాలు చేతకాకపోతే.. ఇంట్లో మూల కూర్చోవాలి. అంతే తప్ప, పోలీసులను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదు. ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మేము ఖాకీ బట్టలు తీసి రాజకీయాల్లోకి వస్తే అయ్యన్న పార్టీకి పుట్టగతులే ఉండవు. ఆయన రాజకీయ జీవితం ఇప్పటికే శూన్యమైపోయింది. అయ్యన్న తీరు చూస్తే ప్రజలకే అసహ్యం వేస్తోంది” అని ఆమె అయ్యన్నపాత్రుడిపై ధ్వజమెత్తారు.
నిజాయితీతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం పాటుపడుతున్న డీజీపీ గౌతం సవాంగ్‌పైనే తప్పుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అయ్యన్న తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నేర్చుకున్న పాఠాలు ఇవేనా అని ఆమె విమర్శించారు. మొత్తానికి పోలీసులను పదేపదే రాజకీయ నేతలు విమర్శిస్తుంటే….ఊరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి స్వర్ణలత విలేకరుల సమావేశమే ఉదాహరణ.
లేడీ పోలీస్ బాబీ రాణి వార్నింగ్
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!