తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ‘కవితక్క’గా పిలుచుకునే తెలంగాణ జాగృతి సారధి, మాజీ ఎంపీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. పార్టీ తరఫున.. తొలిసారి ఎంపీగా గెలిపించి.. తెలంగాణ సమస్యలను ప్రస్తావించడంలో పార్లమెంటులో ఒక ఊపు ఊపిన కవిత, ఇప్పుడిక ఎమ్మెల్సీగా తెరాసకు శాసనసమండలిలో కొత్త బలాన్ని, హంగును జత చేయనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతుండగా.. ఒకటి కవితకు కేటాయించాలని కేసీఆర్ నిర్ణయించారు.
కేసీఆర్ నిర్ణయంతో కవిత ఎమ్మెల్సీ కావడం అనేది కేవలం లాంఛనమే. అంతకుమించి ఆమె ముందు ముందు ఇంకేం పదవులు అధిష్టించబోతున్నారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం నుంచి ముగ్గురు కేబినెట్లో ఉన్నారు. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు మంత్రి పదవులు వెలగబెడుతున్నారు. శాసనమండలిలోకి కవిత వస్తే.. ఆమెకు కూడా మంత్రి పదవి కట్టబెడతారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
నిజానికి కల్వకుంట్ల కవిత 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను అదివరకు ఎంపీగా పనిచేసిన నిజామాబాద్ స్థానంనుంచే మళ్లీ బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆమె మీద గెలిచిన బండి సంజయ్ కు ఇప్పుడు భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా లభించింది. ఎంపీ పదవికి దూరం అయిన కవితకు, తిరిగి అదే పదవిని కేసీఆర్ రాజ్యసభ రూపంలో కట్టబెడతారనే ప్రచారం బాగా జరిగింది. కవిత కూడా రాజ్యసభ సభ్యత్వాన్నే కోరుకున్నట్లు సమాచారం.
కానీ.. తెరాస పార్టీకి పెద్దదిక్కుగా ఉంటున్న కె కేశవరావును ఎంపీగా కొనసాగించాల్సి రావడం, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన సురేష్ రెడ్డికి అవకాశం ఇవ్వాల్సి రావడంతో కవితకు ఆ చాన్సు దక్కలేదు. దీంతో కేసీఆర్ ఆమెను శాసనమండలికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిన నాటినుంచి ఇప్పటిదాకా కవిత ఎలాంటి అధికారిక పదవి లేకుండానే ఉన్నారు. ఇప్పుడు సభలోకి ప్రశేశిస్తున్నారు. అచ్చంగా మంత్రి పదవి కాకపోయినప్పటికీ.. కేబినెట్ సమాన హోదా ఉండే మరేదైనా ఇతర పదవి కూడా ఆమెను త్వరలో వరిస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!