మహర్షి కొత్త గెటప్ ఇదేనా?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. తన కెరీర్ లో ఇది 25వ సినిమా కావడంతో మహర్షిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో…

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. తన కెరీర్ లో ఇది 25వ సినిమా కావడంతో మహర్షిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు ఈ హీరో. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మహేష్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఒక గెటప్ లో స్టూడెంట్ గా, మరో గెటప్ లో బిజినెస్ మేన్ లా కనిపించబోతున్నాడు.

ఈ రెండు గెటప్స్ కు సంబంధించి ఇప్పటికే లుక్స్ కూడా వచ్చేశాయి. స్టూడెంట్ గెటప్ తో టీజర్ రిలీజ్ చేశారు. ఇక బిజినెస్ మేన్ గెటప్ తో రీసెంట్ గా మరో లుక్ విడుదల చేశారు. మరి ఆ మూడో గెటప్ ఏంటనే అంశంపై అందర్లో ఓ చిన్నపాటి ఆసక్తి ఉంది. దానికి సమాధానంగా ఈరోజు ఓ ఫొటో పోస్ట్ చేశాడు మహేష్.

భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్. ఆ ఫొటోలో మహేష్ క్లీన్ షేవ్ లో కనిపిస్తున్నాడు. రెగ్యులర్ గా ఉండే చిన్నపాటి మీసం కూడా తీసేశాడు. ఇక హెయిర్ స్టయిల్ కూడా పూర్తిగా మార్చేశాడు. షార్ట్ కట్ మోడల్ లోకి వచ్చేశాడు. చూడ్డానికి చాలా వెరైటీగా కొత్తగా ఉన్నాడు.

మహర్షిలో మిగిలిన ఆ మూడో గెటప్ కోసమే మహేష్ ఇలా మేకోవర్ అయి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఆ మూడో లుక్ కూడా వచ్చేస్తే, ఈ సస్పెన్స్ కు తెరదించినట్టవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొలాచ్చిలో జరుగుతోంది.

త్వరలోనే హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఇక మూవీకి సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను అబుదాబిలో ప్లాన్ చేశారు.

కెసియార్‌తో జగన్‌ చేతులు కలిపినది నిధుల కోసమా?

పవన్‌ను తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు