సెకెండ్ మండే కూడా సూపరే

సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఫస్ట్ వీకెండ్ అవ్వగానే టఫాల్న కిందకు జారిపోతుంది. హిట్ సినిమా అయితే ఓ వారం తరువాత జారుతుంది. అలా జారలేదు అంటే బ్లాక్ బస్టరే అనుకోవాలి. వీకెండ్ లో…

సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఫస్ట్ వీకెండ్ అవ్వగానే టఫాల్న కిందకు జారిపోతుంది. హిట్ సినిమా అయితే ఓ వారం తరువాత జారుతుంది. అలా జారలేదు అంటే బ్లాక్ బస్టరే అనుకోవాలి. వీకెండ్ లో శనివారం విడుదలయింది ఎఫ్ 2 సినిమా. పైగా పండగ సీజన్. అందువల్ల ఆ మండే సమస్యరాదు.

ఆ తరువాత వారం వచ్చే మండేనే అసలు టెస్ట్. ఎందుకంటే పండగ సెలవులు అయిపోతాయి. పండగ రేట్లు కూడా నార్మల్ కు వచ్చేస్తాయి. వరుసగా ప్రతిరోజూ నాలుగు కోట్ల షేర్ వంతున తొమ్మిది రోజుల పాటు వసూలు చేసిన సినిమాగా ఎఫ్ 2కి ఒక క్రెడిట్ దక్కింది.

నిన్నటికి నిన్న మండే. సెలవులు లేవు. డబుల్ రేట్లు లేవు. కచ్చితంగా ఫిగర్ కనిపించదు. ఆక్యుపెన్సీ వుంటే వుంటుంది కానీ అని అనుకుంటే,  దగ్గర దగ్గర మూడు కోట్ల షేర్ వసూలు చేసేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 2.67 కోట్లు రాబట్టింది. చూస్తుంటే రోజుకు రెండుకోట్ల షేర్ వంతున ఈవారం అంతా లాగేలాగే కనిపిస్తోంది. అలా అయితే కనుక చాలా పెద్ద హిట్ గా మారుతుంది ఎఫ్ 2.

ఈ మండే కలెక్షన్లు ఇలా వున్నాయి
నైజాం……………95 లక్షలు
సీడెడ్.……………31
ఉత్తరాంధ్ర.……..57
ఈస్ట్………………..26
వెస్ట్…………………16
కృష్ణ…………………16
గుంటూరు…………18
నెల్లూరు……………..8

కెసియార్‌తో జగన్‌ చేతులు కలిపినది నిధుల కోసమా?

పవన్‌ను తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు