Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మోడీ వరానికి బాబు మోకాలడ్డు

మోడీ వరానికి బాబు మోకాలడ్డు

రాక రాక అగ్రవర్ణాలు అని ముద్రపడిన కొన్ని కులాలకు మోడీ పుణ్యమా అని పదిశాతం రిజర్వేషన్ వచ్చింది. అయితే దాన్ని రాష్ట్రాలు ఆమోదించడం లేదా ఆమోదించకపోవడం, కాదు అంటే మార్పులు చేర్పులు చేసుకోవడం వంటి కండిషన్ వుంది. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వాడేసుకోవాలని డిసైడ్ అయిపోయారు.

ఎన్నికలు, ఓట్లు చుట్టూ తిరిగే రాజకీయం కనుక, ఈ పదిశాతం ఆర్థికంగా వెనుకబఢిన అగ్రవర్ణాలు అనేవారికి ఇచ్చిన రిజర్వేషన్లలో సగానికి సగం ఏకంగా కాపులకే కేటాయించాలని డిసైడ్ చేసేసారు. రెడ్డి, కమ్మ, రాజు, బ్రాహ్మణ లాంటి వారికి మిగిలిన ఆ అయిదుశాతం అన్నమాట.

ఇప్పుడు ఈ బ్రాహ్మణ, రెడ్డి, రాజు, కమ్మ జనాలు బాబు రాజకీయం గుర్తించాలి. అప్పుడు కానీ ఇలాంటి ఓట్ల రాజకీయానికి అడ్డుకట్టపడదు. నిజానికి కాపులకు రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చింది బాబు. ఆ దిశగా ప్రయత్నాలు సీరియస్ గా చేయడం మానేసి, వాళ్లకు రిజర్వేషన్ కల్పించడం అన్నదానిపై దృష్టివదిలి, మోడీ ఇచ్చిన వరాన్ని తెలివిగా వాడుకోవడం అంటే ఎన్నికల రాజకీయం కాక ఏమనాలి?

ఈ విషయం కనుక రెడ్డి, రాజు, కమ్మ, బ్రాహ్మణ కులాలు గుర్తిస్తే, ఎన్నికల ఫలితం కచ్చితంగా తేడా కొడుతుంది. చంద్రబాబు మరి ఈ విషయంలో మరేం ఎత్తు వేస్తారో? చూడాలి. ప్రస్తుతానికి అయితే కాపుల రిజర్వేషన్ సమస్యను ఈ విధంగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.

కెసియార్‌తో జగన్‌ చేతులు కలిపినది నిధుల కోసమా?

పవన్‌ను తప్పించి, ఆ స్థానంలో తెరాసను తెచ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?