పాత చింతకాయ పచ్చడితో అఖిల్ నెట్టుకొస్తాడా?

ప్రేమిస్తాను.. కానీ పెళ్లి చేసుకోను.. ఈ లైన్ ఇప్పటిది కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా చూస్తునే ఉన్నాం. అప్పుడెప్పుడో వేణు హీరోగా నటించిన స్వయంవరం సినిమాది ఇదే కాన్సెప్ట్. రామ్ చరణ్ చేసిన ఆరెంజ్…

ప్రేమిస్తాను.. కానీ పెళ్లి చేసుకోను.. ఈ లైన్ ఇప్పటిది కాదు. దాదాపు 2 దశాబ్దాలుగా చూస్తునే ఉన్నాం. అప్పుడెప్పుడో వేణు హీరోగా నటించిన స్వయంవరం సినిమాది ఇదే కాన్సెప్ట్. రామ్ చరణ్ చేసిన ఆరెంజ్ సినిమా కూడా ఇలాంటిదే. ఇలా మినిమం గ్యాప్స్ లో ఈ కాన్సెప్ట్ తో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అంతెందుకు, మొన్నటికిమొన్న వచ్చిన పడిపడి లేచేమనసు సినిమాది కూడా ఇదే యాంగిల్. అలాంటి రొటీన్ కథతోనే మిస్టర్ మజ్ను వస్తోంది.

హలో సినిమా తర్వాత ఎన్నో కథలు విన్న అఖిల్ కు చివరికి ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి కథే ఎందుకు నచ్చిందో ఎవ్వరికీ అర్థంకావడం లేదు. స్టోరీలైన్ ఇదే అనే విషయాన్ని టీజర్ లో సూటిగానే చెప్పేశారు. నెల రోజులకు మించి ప్రేమించలేని వ్యక్తి, పెళ్లి వరకు ఎలా వెళ్లాడనేదే ఈ సినిమా స్టోరీ.

ఇలాంటి కథల్లో క్లైమాక్స్ వ్యవహారాలన్నీ రొటీన్ గా ఉంటాయి. ప్రేమిస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోననే హీరో ఇంటర్వెల్ నుంచి పెళ్లి గొప్పదనాన్ని, ప్రేయసి ప్రేమను అర్థంచేసుకుంటూ వస్తాడు. క్లైమాక్స్ లో మూడు ముళ్లు వేయడానికి సిద్ధపడతాడు.

మిస్టర్ మజ్నులో కూడా అలాంటి రొటీన్ స్టఫ్ కనిపిస్తోందంటున్నారు నెటిజన్లు. ఉదాహరణగా పాత సినిమాల క్లిప్పింగులు పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ స్టఫ్ రొటీన్ అయినా ఎమోషనల్ గా ఆకట్టుకుంటే మంచిదే. స్టఫ్ లేదా ఎమోషన్ లో ఏ ఒక్కటి మిస్ అయినా మజ్నుకు మరోసారి ఆశాభంగం తప్పకపోవచ్చు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది మిస్టర్ మజ్ను.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

రామ్ చరణ్ స్టామినా ఇది..!