సాధారణంగా మెగా హీరోలు ఎవరైనా తొలి సినిమా చేస్తున్నారు అంటే ప్రాజెక్టుకు కాస్త క్రేజ్ వుండేలా చూసుకుంటారు. కానీ సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తొలి ప్రాజెక్టు వ్యవహారం చూస్తుంటే వీలయినంత సేఫ్ ప్రాజెక్టుగా వుండాలని ఆది నుంచీ జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.
సినిమా హీరో ఫస్ట్ సినిమా కాబట్టి రెమ్యూనిరేషన్ సాదా సీదాగా వుంటుంది. డైరక్టర్ కు తొలి సినిమా. అందువల్ల పెద్దగా సమస్య వుండదు. దేవీశ్రీప్రసాద్ మాత్రం కాస్త కాస్ట్లీ వ్యవహారం. హీరోయిన్ ను అయినా కొత్త అమ్మాయిని, బాలీవుడ్ ఫిగర్ ను తెచ్చారా అంటే అదీ లేదు.
ఎప్పడో ఒకసారి కమెడియన్ సునీల్ తో ఫ్లాపు సినిమాలో నటించిన మనీషా రాజ్ అనే అమ్మాయిని తీసుకున్నారు. ఈ అమ్మాయికి చాన్స్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్లు వుంటుంది పారితోషికం విషయంలో వ్యవహారం. అంటే వీలయినంత తక్కువలో తీసేసి, డిజిటల్, శాటిలైట్ తోనే సేఫ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే సుకుమార్ కు లాభాల్లో వాటా ఇవ్వాలి కదా? ఇక్కడ మైత్రీ ముగ్గురు నిర్మాతలు, ప్లస్ సుకుమార్. అందుకే చాలా వెల్ ప్లాన్డ్ గా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.