ఏప్రియల్ 24కే మహర్షి?

మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. ఈ సినిమా విడుదల డేట్ మీద చాలా స్పెక్యులేషన్లు వున్నాయి. ఏప్రియల్ 19, 26, మే ఫస్ట్ వీక్. ఇలా రకరకాలుగా. అయితే లేటెస్ట్…

మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. ఈ సినిమా విడుదల డేట్ మీద చాలా స్పెక్యులేషన్లు వున్నాయి. ఏప్రియల్ 19, 26, మే ఫస్ట్ వీక్. ఇలా రకరకాలుగా. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సంగతి ఏమిటంటే, ఈ సినిమా ఏప్రియల్ 24న విడుదల కాబోతోందని. అంటే వారం మధ్యలో అన్నమాట.

సమ్మర్ హాలీడేస్ కాబట్టి, బుధవారం విడుదల చేస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని నిర్మాతగా దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ పోటీలో సినిమాలు ఏవీ వుండవు కాబట్టి, మంచి ఓపెనింగ్స్ నమోదు చేస్తుందని లెక్కలు కడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఆ ముందువారం కాంచన 3 తప్ప మరో సినిమా ఏదీ ఫిక్స్ కాలేదు. మే ఫస్ట్ వీక్ తరువాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ విడుదల వుంటుంది. ఈ సినిమాను నిర్మిస్తున్నది మైత్రీమూవీస్. అందుకే ముందుగానే మహేష్ ను మహర్షి విడుదల గురించి అడిగినట్లు, మహేష్ రెండు లేదా మూడువారాలు గ్యాప్ ఇచ్చి డేట్ వేసుకోమన్నట్లు వినిపిస్తోంది.

అందువల్ల ఏప్రియల్ 24 మహర్షి, మే 10 లేదా ఆ తరువాత డియర్ కామ్రేడ్, దానికి కొంచెం అవతల శర్వా-సుధీర్ వర్మ సినిమా వుండే అవకాశం వుంది. ఈసారి సమ్మర్ కు మహేష్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ సినిమాలు వుంటాయి.

ప్రీ సమ్మర్ లో నాని, నాగచైతన్య, నిఖిల్ సినిమాలు వస్తాయి.వీటి అన్మింటి మధ్యలో తేజ-బెల్లంకొండ శ్రీనివాస్, పూరి- రామ్ సినిమాలు కూడా వుంటాయి.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

స్పైడర్.. అజ్ఞాతవాసిల సరసన ఎన్టీఆర్-కథానాయకుడు!