తరుణ్ భాస్కర్ మూవ్ కరెక్టేనా?

టాలీవుడ్ లో కనిపించని వ్యవహారాలు కొన్ని వుంటాయి. హీరోలు హీరోలుగా వుండడం, డైరక్టర్లు డైరక్టర్లుగా వుండడం ఇలా. కొన్నిసార్లు ఇటు అటు పాత్రలు మార్చుకున్నా నడుస్తాయేమో కానీ, చాలాసార్లు నడవవు. జస్ట్ రెండు సినిమాల…

టాలీవుడ్ లో కనిపించని వ్యవహారాలు కొన్ని వుంటాయి. హీరోలు హీరోలుగా వుండడం, డైరక్టర్లు డైరక్టర్లుగా వుండడం ఇలా. కొన్నిసార్లు ఇటు అటు పాత్రలు మార్చుకున్నా నడుస్తాయేమో కానీ, చాలాసార్లు నడవవు. జస్ట్ రెండు సినిమాల వయస్సు డైరక్టర్ తరుణ్ భాస్కర్ ది. ఇప్పుడు ఆయనే హీరోగానో, లీడ్ రోల్ గానో మారి సినిమా చేయబోతున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి.

కాంటెంపరరీ కొత్త ఆలోచనలు చేయగల యువ దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. మంచి సినిమా అందించగల సత్తా వుంది. అలాంటి డైరక్టర్ కాస్తా నటుడు అయితే వ్యవహారం ఎలా వుంటుందో తెలియదు. డైరక్టర్ హీరో అయిపోయిన తరువాత మళ్లీ డైరక్ట్ చేస్తామంటే డేట్ లు ఇచ్చే హీరోలు తక్కువ. అలాగే డైరక్టర్ హీరో అయిపోతే డైరక్ట్ చేయడానికి ముందుకు వచ్చే డైరక్టర్లు తక్కువ.

అలాంటి సమయంలో తన సినిమాలు, తనే హీరో, తనే డైరక్టర్ అన్నట్లు వుంటుంది వ్యవహారం. క్లిక్ అయితే ఒకె. కానీ పదే పదే అదే రిపీట్ చేయడం అన్నది సాధ్యంకాదు. అందువల్ల తరుణ్ భాస్కర్ నిర్ణయం ఆయన కెరీర్ ను ఆయనే రిస్క్ లో పెట్టుకున్నట్లు అవుతుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

స్పైడర్.. అజ్ఞాతవాసిల సరసన ఎన్టీఆర్-కథానాయకుడు!