పూనమ్ పాండే 'పెద్దలకు మాత్రమే' అనే తరహాలో ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాత్రికి రాత్రి ఈ వీడియో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెను సంచలనమయే అయ్యింది. ఆ వెంటనే ఆ పోస్ట్ ఆమె అకౌంట్ నుంచి మాయమయ్యిందిగానీ, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆమె గురించిన చర్చే జరుగుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్.. ఇలా అన్నిచోట్లా ఇప్పుడు ఆ వీడియో అందుబాటులో వుంది. బహుశా ఈస్థాయి సంచలనమే పూనమ్ పాండే కోరుకుని వుండొచ్చు.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫొటోలు పెట్టడంతో పూనమ్ పాండే తర్వాతే ఎవరైనా. అప్పుడెప్పుడో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిస్తే, మైదానంలో నగ్నంగా నడుస్తానంటూ సంచలన ప్రకటన చేసి వార్తల్లోకెక్కిన పూనమ్, టీమిండియా వరల్డ్ కప్ గెలిచినా ఆ పని చేయలేదుగానీ, అక్కడినుంచే ఆమె 'నగ్న ప్రస్థానం' మరింత జోరుగా సోషల్ మీడియాలో షురూ అయ్యిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
బాలీవుడ్లో ఒకటీ అరా సినిమాలు చేసిన పూనమ్ పాండే, తెలుగులో ఆ మధ్య 'లేడీ గబ్బర్ సింగ్' అనే సినిమా ఒకటి చేసింది. అయితే అదింకా విడుదల కాలేదనుకోండి.. అది వేరే విషయం. పండగల పేరు చెప్పి సెమీ న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి, అదోటైపు 'ఆనందం' పొందుతుంటుంది పూనమ్ పాండే. ఆమె నగ్న వీడియోలు, ఫొటోల కోసం సోషల్ మీడియాలో కొందరు అభిమానులూ ఎదురు చూస్తుంటారు.
ఇంతకీ, పూనమ్ పాండే 'పెద్దల బొమ్మ'.. అదేనండీ పోర్న్ వీడియో లాంటిది ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు.? ఎందుకు వెంటనే తొలగించినట్లు.? దీనికి ఆమె ఆల్రెడీ వివరణ ఇచ్చినా, అదంత సమంజసంగా ఏమీ అన్పించడంలేదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ స్వయంగా ఈ వీడియో లీక్ చేశాడట. నమ్మేదెలా.?