పూరి జగన్నాధ్ గురించి బండ్లగణేష్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. ఆ ఇద్దరి స్నేహం అలాంటిది. పూరి జగన్నాధ్ కు భారీ బహుమతులు ఇచ్చాడు. సినిమాలు చేసాడు.
పూర్తిగా పూరి మీదే వదిలేసి, తాను ఇండియాలో కూర్చుని ఇద్దరమ్మాయిలతో సినిమా చేసాడు. ఇలా పూరి తాను వేరు కాదన్నంతగా కలిసిపోయాడు. అలాంటి బండ్ల గణేష్ నిన్నటికి నిన్న సుతిమెత్తగా చురకలు వేసాడు.
పూరి తనయడు ఆకాష్ నటించిన చోర్ బజార్ సినిమా ఫంక్షన్ లో బండ్ల గణేష్ ప్రసంగించాడు. ఇటీవల బండ్ల ప్రసంగాలకు అవకాశం లేకపోయింది. పవన్ కళ్యాణ్ దూరం పెట్టడంతో. ఇన్నాళ్లకు మళ్లీ సినిమా స్టేజ్ ఎక్కే అవకాశం వచ్చింది.
పవర్ స్టార్ అయినా పూరి ఆకాష్ అయినా తన స్టయిల్ ఒక్కటే అన్నట్లు మాట్లాడేసాడు. పనిలో పనిగా పూరి భార్య ను ఏకంగా సీతా దేవి, కుంతీ దేవి లెవెల్ కు చేర్చేసాడు. అంత ఓర్పు, సహనం ఏమిటి చూపించాల్సి వచ్చిందో? ఎందుకు చూపించాల్సి వచ్చిందో మరి?
ఆ విషయం కూడా ఇండైరెక్ట్ చెప్పకనే చెప్పాడు. పూరి దగ్గర వంద రూపాయలు కూడా లేనపుడు, భార్య లావణ్య వచ్చిందని,. పెద్ద డైరక్టర్ అయ్యాక ర్యాంప్..వ్యాంప్ లు వచ్చారని అన్నారు. ఇంతకీ పూరి దగ్గరకు చేరి ఈ ర్యాంప్ లు..వ్యాంప్ లు అంటూ బండ్ల టార్గెట్ చేసింది చార్మి యేనా? మరేవరైనా వున్నారా? పూరి పర్సనల్ వ్యవహారాలు అన్నీ ఏవో మదిలో పెట్టుకునే బండ్ల ఈ ప్రసంగం చేసినట్లు కనిపిస్తోంది.
పనిలో పనిగా హీరోలను కూడా వేసుకున్నాడు. డైలాగ్ లు రాని వాళ్లకు డైలాగ్ లు నేర్పాడని, డ్యాన్స్ లు రాని వాళ్లకు పూరి డ్యాన్స్ లు నేర్పాడని కానీ వాళ్లంతా ఇప్పుడు మొహం చాటేసారని గట్టిగానే వేసుకున్నాడు.
బండ్ల అంతే…స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే పూనకాలే. ఏం మాట్లాడతాడో అన్నదానికి కంట్రోలు వుండదు.