బావమరిది సినిమాకు బావగారు

అల్లు అరవింద్..మెగా బావమరిది. ఆయన నిర్మించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రీలీజ్ ఫంక్షన్ కు బావ మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు.  Advertisement మారుతి డైరక్షన్ లో గోపీచంద్..రాశీఖన్నా జంటగా నటించిన ఎంటర్ టైనర్…

అల్లు అరవింద్..మెగా బావమరిది. ఆయన నిర్మించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రీలీజ్ ఫంక్షన్ కు బావ మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. 

మారుతి డైరక్షన్ లో గోపీచంద్..రాశీఖన్నా జంటగా నటించిన ఎంటర్ టైనర్ 'పక్కా కమర్షియల్'. ఈసినిమాను తన దైన స్టయిల్ లో ఫుల్ ఫన్ జోడించి, దానికి గోపీచంద్ స్టయిల్ యాక్షన్ ను మిక్స్ చేసి రూపోందించారు.

కేవలం గోపీచంద్ మీద మాత్రమే కాకుండా రావు రమేష్, సప్తగిరి, ప్రవీణ్, వైవా హర్ష ఇలా పుల్ ఫన్ స్టార్ కాస్ట్ ను తీసుకుని చేసిన సినిమా. సత్యరాజ్ ఈ స్టార్ కాస్ట్ కు స్టార్ అట్రాక్షన్.  

కోర్టు బ్యాక్ డ్రాప్ లో ఫుల్ ఫన్ సినిమా రాలేదు ఇప్పటి వరకు. అప్పడప్పుడు కొన్ని సీన్లు తప్ప. పైగా లాయర్ల మీద ఫుల్ ఫన్ చేయడం కూడా మన సినిమాల్లో లేదు.

బాలీవుడ్ లో జాలీ ఎల్ఎల్ బి లాంటి సినిమాలు వచ్చాయి. అందుకే మారుతి ఈసారి ఈ జానర్ ఎంచుకున్నారు. గోపీచంద్ కూడా పుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేసి చాలా కాలం అయింది. జూలై 1న ఈ సినిమా విడుదలవుతోంది.