రిలీజ్ కు ముందే 2 సినిమాల కథలు చెప్పేశారు..!

ప్రమోషన్ లో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. కొందరు తమ సినిమా కథపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. మరికొందరు ముందే కథ మొత్తం చెప్పేస్తారు. కానీ ఇలా కథ మొత్తం చెప్పేస్తూ, ఒకే…

ప్రమోషన్ లో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. కొందరు తమ సినిమా కథపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. మరికొందరు ముందే కథ మొత్తం చెప్పేస్తారు. కానీ ఇలా కథ మొత్తం చెప్పేస్తూ, ఒకే రోజు 2 సినిమాలు రావడం మాత్రం చెప్పుకోదగ్గ విశేషం. ఈ వీకెండ్ సమ్మతమే, చోర్ బజార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల కథలు ముందుగానే చెప్పేశారు మేకర్స్.

ముందుగా సమ్మతమే విషయానికొద్దాం. ఇందులో హీరో పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుందని హీరో నమ్ముతాడు. అందుకే పెళ్లి చేసుకోవాలని చిన్నప్పట్నుంచే ఫిక్స్ అవుతాడు. మొదటి పెళ్లిచూపుల్లోనే ఓ అమ్మాయి ఎదురౌతుంది. ఆ అమ్మాయి లైఫ్ స్టయిల్ కు, కృష్ణ లైఫ్ స్టయిల్ కు అస్సలు సెట్ అవ్వదు. ఇలా ఓ మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపధ్యం ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే అంశాలతో ఎంటర్ టైనింగ్ గా చెప్పిన సినిమా సమ్మతమే.

ఇక ఇదే కోవలో చోర్ బజార్ సినిమా కథ కూడా మొత్తం చెప్పేశారు. హీరో మెకానిక్. అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమె మూగమ్మాయి. తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సినిమాల్లోని డైలాగ్స్ వినిపిస్తూ చెబుతుంది. అలా ఓవైపు ప్రేమకథ చూపిస్తూనే,మరోవైపు డైమండ్ స్టోరీ నడిపించారు. వంద కోట్ల విలువైన డైమండ్ మిస్సవుతుంది. అది చోర్ బజార్ లో ప్రత్యక్షమౌతుంది. దాని విలువ తెలియని చోర్ బజార్ జనం 10 రూపాయలకే దాన్ని అమ్ముంటారు. హీరో ప్రేమకు, ఈ డైమండ్ కు ఎలా లింక్ పడుతుంది, ఫైనల్ గా ఆ డైమండ్ ను హీరో ఎలా సాధించాడు అనేది స్టోరీ.

ఇలా 2 సినిమాల కథల్ని ముందుగానే నీట్ గా చెప్పేసి మరీ థియేటర్లలోకి వస్తున్నారు మేకర్స్. వీటిలో సమ్మతమే సినిమాలో కిరణ్ అబ్బవరం, చోర్ బజార్ సినిమాలో ఆకాష్ పూరి హీరోలుగా నటించారు. వీళ్లిద్దరికీ ఈ రెండు సినిమాలు కీలకం. ఇంకా చెప్పాలంటే కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో వీళ్లిద్దరూ ఉన్నారు. ఈ వీకెండ్ వీళ్ల జాతకాలు తేలిపోతాయి.