కరోనాతో యుద్ధం.. తెలంగాణ సంచలన నిర్ణయం

తెలంగాణలో కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడ్డంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఏకంగా.. గచ్చిబౌలి స్టేడియంను…

తెలంగాణలో కొత్తగా మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడ్డంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఏకంగా.. గచ్చిబౌలి స్టేడియంను కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు, వైద్యారోగ్య శాఖ అధికారులు స్టేడియంను పరిశీలించారు. పారిశుధ్య పనులు పూర్తిచేసి, 2 రోజుల్లో స్టేడియంను 300 పడగల కరోనా క్వారంటైన్ కేంద్రంగా మార్చబోతున్నారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే గాంధీ, ఛెస్ట్, ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి తోడు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో పాటిజివ్ కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ.. అనుమానిత రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో గచ్చిబౌలి స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ఇకపై కరోనా లక్షణాలతో వచ్చిన అనుమానితుల్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారన్నమాట.

తాజాగా తెలంగాణలో మరో పాజిటివ్ కేసు బయటపడిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 119కి చేరింది. మహారాష్ట్రంలో అత్యథికంగా కరోనా కేసుల సంఖ్య 33కి చేరింది. అటు కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటకలో కూడా పాటిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు ఇద్దరు కరోనా వల్ల మృతిచెందగా.. 10 మంది ఈ మహమ్మారిని జయించి డిశ్చార్జ్ అయ్యారు.

అటు ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలకు వ్యాపించింది కరోనా. మృతు సంఖ్య 6515కు చేరింది. చైనా తర్వాత అత్యథికంగా ఇటలీలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఇటలీలో 368 మంది చనిపోయారు.

చిరంజీవి సినిమా షూటింగ్ ఆపేసారు