రాముడు కాదు.. రుద్ర కాళేశ్వరుడు

కెరీర్ లో ఫస్ట్ టైమ్ మాస్-యాక్షన్ మూవీ చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే వెల్లడించింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి ప్రకటన వచ్చింది. ప్రకటనలో భాగంగా సినిమాలోని ఓ డైలాగ్…

కెరీర్ లో ఫస్ట్ టైమ్ మాస్-యాక్షన్ మూవీ చేయబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే వెల్లడించింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి ప్రకటన వచ్చింది. ప్రకటనలో భాగంగా సినిమాలోని ఓ డైలాగ్ తో ఓ యానిమేషన్ వీడియోను విడుదల చేశారు. “ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు” అని చెప్పే డైలాగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో చెప్పారు.

ఇక వీడియో చివర్లో మాస్ గెటప్ లో, మెలితిరిగిన మీసాలతో త్రిశూలం పట్టుకున్న వైష్ణవ్ తేజ్ లుక్ ను చూపించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. త్రివిక్రమ్ కు చెందిన ఫార్చూన్4సినిమాస్ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరించనుంది.

సినిమా ప్రకటన రోజే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. కెరీర్ లో వైష్ణవ్ తేజ్ కు ఇది నాలుగో చిత్రం.

ఉప్పెనతో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, రెండో సినిమా కొండపొలంతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక మూడో సినిమా రంగరంగ వైభవంగా సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. ఇప్పుడు నాలుగో సినిమాగా ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు.

నిజానికి వైష్ణవ్ నాలుగో సినిమాగా, అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై ఓ సినిమా చేయాల్సి ఉంది. దానికి సంబంధించి కథాచర్చలు కూడా పూర్తయ్యాయి. కానీ దానికంటే ముందు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.