నైజాంలో కొత్త సిండికేట్?

టాలీవుడ్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో నైజాంది ప్రత్యేకస్థానం. అయితే రాను రాను ఇక్కడ మోనోపలి పెరిగిపోతోందన్నది నిర్మాత అంతర్గత చర్చల్లో వినిపించే విషయం. కేవలం దిల్ రాజు, ఏషియన్ సునీల్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా…

టాలీవుడ్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో నైజాంది ప్రత్యేకస్థానం. అయితే రాను రాను ఇక్కడ మోనోపలి పెరిగిపోతోందన్నది నిర్మాత అంతర్గత చర్చల్లో వినిపించే విషయం. కేవలం దిల్ రాజు, ఏషియన్ సునీల్ మాత్రమే ఇక్కడ ఎక్కువగా యాక్టివ్ గా వుంటున్నారు. చాలామంది నైజాంలో తమవంతు ప్రయత్నం చేసినా, ఫలితం సాధించలేకపోతున్నారు. దీనికి చాలా కారణాలు వున్నాయి.

ముఖ్యంగా ఆంధ్ర అంటే ఆరు ఏరియాలుగా డివైడ్ అయి వుంది. సీడెడ్ కూడా ఇలాగే ముక్కలు ముక్కలుగా విభజించి వుంది. కానీ నైజాం వరకు వచ్చేసరికి టోటల్ ఒక్కటే ఏరియాగా అమ్మకాలు చేస్తున్నారు. దాంతో పెద్ద మొత్తాలు పెట్టుబఢి పెట్టాల్సి వస్తోంది. దాంతో ఎవరు పడితే వారు రంగంలోకి దిగలేరు. దిగినా, ఫలితం తేడావస్తే, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా వుంటోంది.

దీనివల్ల నైజాంలో నిర్మాతలు సినిమాలు అమ్ముకోవడం కష్టం అవుతోంది. డిస్ట్రిబ్యూషన్ కే ఇవ్వాల్సి వస్తోంది ఎక్కువగా. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ప్రపంచం అంతటా అమ్ముడుపోయినా, నైజాంలో మాత్రమే 16 కోట్ల రిటర్న్ బుల్ అడ్వాన్స్ మీద ఇచ్చారు.

దీంతో ఇప్పుడు నైజాంలో మరో కొత్త ప్లేయర్ రంగప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లేయర్ కొత్త ఏమీకాదు. హీరో నితిన్ తండ్రి, పంపిణీదారు సుధాకర్ రెడ్డి, అలాగే కేఎఫ్ సి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో సినిమాలు పంపిణీచేస్తున్నవారు, ఇప్పుడు చేతులు కలిపారు.

ఈ రెండు సంస్థలు కలిసి ఓ కొత్త సంస్థను ఫ్లోట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ కొత్త సంస్థకు ఇంకా నామకరణం చేయలేదు కానీ, రెండు మూడు ప్రాజెక్టులు చేతిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో కాంచన 3, దేవ్ సినిమాలు వున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతలు కూడా ఇకపై ఎవరైనా యాక్టివ్ బయ్యర్లు వస్తే, నైజాంను కూడా హైదరాబాద్ ఏరియా, వరంగల్, ఖమ్మం ఏరియా, మిగిలిన నైజాం ఏరియాలను విడివిడిగా విక్రయించే అలవాటు చేయాలని చూస్తున్నారు. అలా అయితే బయ్యర్లు పెరుగుతారు. మోనోపలి తగ్గుతుంది. 

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!