ప్రీ సమ్మర్, సమ్మర్, పోస్ట్ సమ్మర్ కలిపి దాదాపు 16 వారాలు. అంటే కనీసం వారం వారం గ్యాప్ ఇచ్చినా ఎనిమిది పెద్ద సినిమాలు వేసుకోవచ్చు. కానీ ఈసారి అలాంటి అవకాశం కనిపించడం లేదు. ఏప్రియల్ నెలాఖరులో మహర్షి, ఆగస్టులో సాహో తప్ప మరో పెద్ద సినిమాలేదు.
అలా అని మీడియం సినిమాలు కూడా ఎక్కువగా లేవు. నాని, చైతన్య, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్ ల సినిమాలు తలా ఒకటి వున్నాయి. నిఖిల్, అల్లుశిరీష్, కళ్యాణ్ రామ్ ల సినిమాలు మార్చిలోనే వచ్చేస్తున్నాయి. నాని, చైతన్యల సినిమాలు జెర్సీ, మజిలీ రెండు ఒక డేట్ కే వస్తున్నాయి. శర్వానంద్-సుధీర్ వర్మల సినిమా ఇంకా చాలా వర్క్ వుంది.
సాయిధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా మే 12న విడుదల చేసే ఆలోచనలో వున్నారు. దానికి కాస్త గ్యాప్ ఇచ్చి డియర్ కామ్రేడ్ విడుదల చేస్తారు. అంటే జూన్, జూలైల్లో క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ ప్లానింగ్ లు అయితే, ఇప్పట్లో లేనట్లే. ఒక్క శర్వానంద్ సినిమా మాత్రమే వుండొచ్చు. మొత్తంమీద చూసుకుంటే ఈసారి సమ్మర్ వినోదం కాస్త తక్కువే వుంటుందేమో?
ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, సినిమాలు ఏవీ ఈ దరిదాపుల్లో లేవు. మీడియం హీరోలు కూడా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఫ్లాపులు పలకరిస్తే లేవడం కష్టం అవుతోంది. అందుకే సినిమాల సంఖ్య తగ్గుతోంది.