Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రాజును చూసిన కళ్లతో...

రాజును చూసిన కళ్లతో...

ఒకసారి ఒకరు ఓ జోనర్ టచ్ చేస్తే టాలీవుడ్ ఇక అదే పోక పోతుంది. నాని హీరోగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ప్రకటనతో స్టార్ట్ అయింది. విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామ్రేడ్ లోనూ క్రికెట్ వ్వవహారం వుంది. ఆ సినిమాలో హీరోయిన్ క్రికెటర్. ఇప్పుడు ఈ లీగ్ లో నాగచైతన్య కూడా జాయిన్ అయ్యాడు.

ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చుకుంటూ, మినిమమ్ ఓపెనింగ్స్ కు కూడా దూరమవుతూ వస్తున్నాడు నాగచైతన్య. ఇక చేతిలో మిగిలినవి రెండు సినిమాలు. అందులో ఫుల్ ఎమోషన్లతో నిండిన మజిలీ సినిమా ఒకటి. వెంకీ మామతో కలిసి చేస్తున్న వెంకీ మామ రెండోది.

మజిలీ టైటిల్ అనౌన్స్ చేసినపుడే అక్కినేని ఫ్యాన్స్ లో నెగిటివ్ టాక్ వచ్చింది. ఇదేం టైటిల్ డబ్బింగ్ సినిమాలదో, లేదా చిన్న సినిమాలదో టైటిల్ మాదిరగా వుందని. దానికితోడు నాగచైతన్య ఎమోషన్లు పండించడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు.

ఇలాంటి పేథ్ంయంలో ఇప్పుడు ఈ మజిలీకి రెండోలుక్ వదిలారు. ఈ లుక్ లో నాగచైతన్య క్రికెటర్ గా కనిపించాడు. ఇటీవలే వచ్చిన నాని జెర్సీ టీజర్ చూసిన వారికి ఈ లుక్ చూస్తుంటే హిట్ విడియో కో, సాంగ్ కో డబ్ స్మాష్ చేసినట్లుంది. బ్యాట్ పట్టుకుని ఫోజ్ ఇచ్చినట్లుంది తప్ప, నాచురల్ లుక్ రాలేదు.

నిజానికి ఈ సినిమాలో చైతూ క్రికెట్ కన్నా, చైతూ ప్రేమించిన అమ్మాయి క్రికెట్ వ్యవహారం ఎక్కువు. అయితే నాని సినిమా లుక్ రావడంతో అర్జెంట్ గా ఫోటో షూట్ చేసి ఈ రెండో లుక్ వదిలినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పెళ్లయిన హీరో హీరోయిన్ల జంట మధ్య పొరపచ్చాల నేపథ్యంలో సాగే కథలో ఈ క్రికెట్ లాంటి వ్యవహారాలు జస్ట్ యాండింగ్ ఫీచర్స్ నే కావచ్చు. చూడాలి ఈ సినిమా అయినా చైతన్య నిర్మాతలను గట్టెక్కించే సినిమా అవుతుందేమో?

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?