అసలే నాలుగు ఫ్లాపులతో వున్నాడు నాగచైతన్య. సాహసం శ్వాసగా, యుద్దం శరణం, శైలాజారెడ్డి అల్లుడు, సవ్యసాచి. ఇలాంటి టైమ్ లో సరైన సినిమా, సరైన డేట్ చూసి వదలాలి. కానీ పోయి, పోయి నాని లాంటి కే్జీ హీరోతో కాంపిటీషన్ కు దిగుతున్నాడు నాగచైతన్య.
నాని నటించిన జెర్సీ సినిమా ఏప్రియల్ 5న విడుదలకు రెడీ అవుతోంది. నాగచైతన్య మజిలీ సినిమాను కూడా అదే డేట్ కు వదులుతున్నారు. సమ్మర్ ప్రారంభంలో యూత్ ఫుల్ సినిమాలకు, క్రేజీ హీరోలకు మాంచి ఓపెనింగ్స్ వుంటాయి. నాని జెర్సీ సినిమా అలాంటిదే.
వాస్తవానికి జెర్సీ సినిమాలో నాని మిడిల్డ్ ఏజ్డ్ క్రికెటర్. మజిలీ సినిమాలో హీరోకి జస్ట్ క్రికెట్ టచ్ వుంటుంది. కానీ లవ్ స్టోరీ, బ్రేక్ అప్, వేరే పెళ్లి, ఫస్ట్ లవ్ కూతురికి క్రికెట్ నేర్పించడం వంటి వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది.
ఇలా జోనర్లు కాస్త టచ్ అవుతున్నపుడు హీరోలు జాగ్రత్తగా వుండాలి. డేట్ లు క్లాష్ కాకుండా చూసుకోవాలి. కానీ ఎక్కడ నాని సినిమా తరువాత వస్తే, జోనర్ డైల్యూట్ అవుతుందో అని ఆందోళన చెందుతున్నట్లున్నారు.
అందుకే సేమ్ డేట్ గా ఏప్రియల్ 5 ప్రకటించేసారు. ఇది చాలా రిస్క్ వ్యవహారం. జనాలు ఒకదానితో ఒకటి పోల్చుకున్నా, ఒక హీరోతో మరొకర్ని పోల్చుకున్నా, రిజల్ట్ రివర్స్ అయ్యే ప్రమాదం వుంది.