పవన్ కల్యాణ్ కూడా ఆ ట్రూప్ లో చేరిపోయారా?

పవన్ పై ఎన్ని విమర్శలున్నప్పటికీ, ఓ విషయంలో మాత్రం పాజిటివ్ రిమార్క్ ఉండేది. పాలసీలు, స్కీములకు సంబంధించి ఆయన నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడరని, లెక్కలు తెలుసుకొని మాట్లాడతారని కొంతమంది అనుకున్నారు. కానీ…

పవన్ పై ఎన్ని విమర్శలున్నప్పటికీ, ఓ విషయంలో మాత్రం పాజిటివ్ రిమార్క్ ఉండేది. పాలసీలు, స్కీములకు సంబంధించి ఆయన నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడరని, లెక్కలు తెలుసుకొని మాట్లాడతారని కొంతమంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ కూడా పోయింది. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ట్రూప్ లో చేరిపోయారు. నోటికి ఏదొస్తే అది వాగుతున్నారు. అలవోకగా అబద్ధాలాడుతున్నారు.

మొన్నటికిమొన్న ఏపీ సర్కారు చేసిన అప్పులపై ఇష్టమొచ్చినట్టు వాగారు పవన్ కల్యాణ్. ఆ లెక్కలు, లొసుగులు అన్నింటినీ కాగ్ వెలుగులోకి తెస్తోందని అన్నారు. కట్ చేస్తే, కాగ్ రిపోర్ట్ రానే వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చేసిన అప్పు తక్కువేనని కాగ్ నిర్థారించింది. లెక్కలన్నీ బయటపెట్టింది. ఇప్పుడు పవన్ ఏమంటారు?

2021–22 ఆర్థిక సంవత్సరానికి తీసిన లెక్కల ప్రకారం.. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీ అప్పు తక్కువగా ఉంది. అప్పు అంటే ఇక్కడ ద్రవ్యలోటు అని పరిగణించాలి. ఆంధ్రప్రదేశ్‌ లో అతి తక్కువ ద్రవ్యలోటు ఉంది, అంటే ఏపీ అతి తక్కువ అప్పుల్లో ఉంది. ఈ విషయం ప్రతిపక్షాలకు తెలుసు, ఎల్లో మీడియాకి అంతకంటే బాగా తెలుసు. కానీ కాగ్ లెక్కల్ని చూపిస్తూ ఇప్పటి వరకూ ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తోంది టీడీపీ. తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఇలా బురదజల్లే క్రమంలో ముందుగా తను బురద పూసుకున్నారు.

టీడీపీ ఐదేళ్ల పాలనలో ద్రవ్యలోటు 3శాతానికి మించి ఉండేది. అలాంటి ద్రవ్యలోటునుని వైసీపీ ప్రభుత్వం గతేడాది 2.1 శాతానికి పరిమితం చేసింది. ఓవైపు సంక్షేమ పథకాలతో కుస్తీ పడుతున్నా.. మరోవైపు పరిమితంగానే అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు జగన్. మిగతా విషయాల్లో ఎక్కడ ఎలా సర్దుబాట్లు చేసుకుంటున్నా కూడా ఆ ప్రభావం సంక్షేమ పథకాలపై పడనీయడంలేదు. దీంతో ప్రతిపక్షాలకు కడుపు మండింది.

అప్పులు చేయడంలేదు, సంక్షేమ పథకాలు ఆగడంలేదు.. ఇది ఎలా సాధ్యమంటూ లాజిక్ లు తీస్తున్నాయి. తాము చేసిన దుబారా జగన్ చేయడంలేదని మాత్రం ఒప్పుకోవడంలేదు. జగన్ కి ఎలా సాధ్యమైందని, అప్పులే కారణం అంటూ ఆరోపణలు చేస్తున్నాయి. చివరకు కాగ్ లెక్కలు బయటకొచ్చేసరికి పెదబాబు, చినబాబు, దత్తత బాబు.. అందరూ షాకయ్యారు.