‘పక్కా’ గా ప్లస్సూ..మైనస్సూ వాళ్లే

మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తోంది. ఈ సినిమా దర్శకుడు మారుతికి ప్రెస్టీజ్ క్వశ్చను. ఎందుకంటే ఈ సినిమా తరవాత ప్రభాస్ సినిమా చేతిలోకి రావాల్సి వుంది. ఇప్పుడు పక్కా కమర్షియల్…

మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తోంది. ఈ సినిమా దర్శకుడు మారుతికి ప్రెస్టీజ్ క్వశ్చను. ఎందుకంటే ఈ సినిమా తరవాత ప్రభాస్ సినిమా చేతిలోకి రావాల్సి వుంది. ఇప్పుడు పక్కా కమర్షియల్ కు ప్లస్ మైనస్ ఆ సినిమానే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ నే.

తమ హీరోతో సినిమా చేయబోతున్న డైరక్టర్ సినిమా కాబట్టి ఈ సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ అండగా నిలవాల్సి వుంటుంది. పైగా గా గోపీచంద్ కూడా ప్రభాస్ కు నేస్తం కనుక అండగా నిలిస్తే ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్లస్ అవుతుంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ కనుక కాస్త బాగున్నా పాస్ అవుతుంది.

కానీ ఇక్కడే మరో సమస్య ఈ సినిమా ఏమాత్రం బాగున్నా ఒకె కానీ, లేకపోతేనే వస్తుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అడ్డం తిరిగే ప్రమాదం వుంది. ఇప్పటికే మారుతి-ప్రభాస్ సినిమా అంటే కామెంట్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. 

ఇప్పుడు ఈ సినిమా కనుక కాస్త ఇబ్బంది పెడితే వాళ్ల నోళ్లకు బలం వస్తుంది. ప్రభాస్ తో మహా భారీ సినిమా చేస్తున్న నిర్మాత ఒకరు కూడా మారుతి సినిమాకు అడ్డం పడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా తేడా వస్తే ఆయన కూడా మరింతగా లేస్తారు. 

అందువల్ల మారుతి 'పక్కా' గా హిట్ కొట్టి తీరాల్సిందే. ఏ మాత్రం ఎంటర్ టైన్ మెంట్ వున్నా జనం ఆదరిస్తున్నారు. ఎఫ్ 3 సినిమాను అలాగే ఆదరించారు. లాజిక్ లు చూడకుండా ఫన్ మ్యాజిక్ వుంటే చాలంటున్నారు. అందువల్ల పక్కా కమర్షియల్ కు అదే మినిమమ్ గ్యారంటీ అనుకోవాలి.