అమ్మో… ఎలుగుబంటి…సిక్కోలులో వీరంగం

అదేంటో అరణ్యాలలో తిరగాల్సిన క్రూర మృగాలు జన వాసాలలో తిరుగుతున్నాయి. పులులు, ఎలుగుబంట్లు ఇలా అడవి జంతువులు ఊళ్ళ మీద పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు గ్రామంలో ఒక ఎలుగుబంటి తాజాగా చేసిన…

అదేంటో అరణ్యాలలో తిరగాల్సిన క్రూర మృగాలు జన వాసాలలో తిరుగుతున్నాయి. పులులు, ఎలుగుబంట్లు ఇలా అడవి జంతువులు ఊళ్ళ మీద పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు గ్రామంలో ఒక ఎలుగుబంటి తాజాగా చేసిన దాడిలో ఒకరు మృత్యువాత పడగా మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దాంతో పలాస, వజ్రపుకొత్తూరు, ఉద్దానం ప్రాంతాలలో ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ముఖ్యంగా జీడితోటలు, కొబ్బరి తోటలలో పనిచేసే వ్యవసాయ కూలీలు ఎలుగుబంటి సంచారంతో ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి ఉంది.

శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఏనుగులు సంచారం ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. పంట పొలాల మీదకు అవి వస్తున్నాయి. ఇపుడు తోటలలో పనిచేసుకునే వ్యవసాయ కూలీల మీద ఎలుగు దాడులు ఎక్కువ కావడంతో జనాలు భయపడుతున్నారు.

జనావాసాల మీద మక్కువ చూపుతున్న అడవి జంతువుల బారి నుంచి తప్పించుకునే దారి చెప్పాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ఇపుడు పలాస పరిసరాలు అన్నీ కూడా అమ్మో ఎలుగుబంటి అంటూ కలవరపడుతున్నాయి.