మొదలైన ఎమ్మెల్సీ పోలింగ్.. టీఆర్ఎస్ కు మరో పరీక్ష

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో మరో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొద్దిసేపటి కిందట పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు సాగే ఈ…

దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో మరో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కొద్దిసేపటి కిందట పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు సాగే ఈ పోలింగ్ లో 10 లక్షల 36వేల 833 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణలో మొత్తం 21 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. రెండు స్థానాలకు కలిపి మొత్తంగా 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1835 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం 9 జిల్లాల్లో విస్తరించి ఉంది.

నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం 12 జిల్లాల్లో విస్తరించి ఉంది. వీటిలో హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం. ఎందుకంటే, ఈ స్థానం ఆ పార్టీకి ఎప్పుడూ దక్కలేదు. ఈ ఒక్క స్థానంపైనే 93 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ఈ ఎన్నికల్లో ఓటింగ్ విధానమే కాకుండా, ఓట్ల లెక్కింపు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఓటరు, ఒక అభ్యర్థికి మాత్రమే ఓటేస్తాడు. కానీ ఈ ఎన్నికల్లో ఓటింగ్ పూర్తి భిన్నం. తొలి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు.. అభ్యర్థులకు ఇలా ఓట్లు వేయాల్సి ఉంటుంది. సో.. ఓట్ల లెక్కింపు కూడా ఎలిమినేషన్ పద్ధతిలోనే ఉంటుంది. చాలామంది అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓట్లు దక్కవు. ఎక్కువమంది రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గట్టెక్కుతుంటారు.

ఈ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అటు టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి, నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ లో ఉత్సాహం నింపడంతో పాటు.. సాగర్ ఉప ఎన్నికకు మరింత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకోవాలని చూస్తోంది. 17న కౌంటింగ్ ఉంటుంది. రెండు స్థానాలకు సంబంధించి ఇటు హైదరాబాద్ లో, అటు నల్గొండలో ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇదంతా జ‌గ‌న్ శ్ర‌మ ఫ‌లితమే..

నా సినిమాలు ఎక్కువగా ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం..?