నా హృద‌యం ముక్క‌లైంది- యంగ్ హీరో

త‌న హృద‌యం బ‌ద్ద‌లైంద‌ని యంగ్ హీరో రామ్ ఆవేద‌న‌తో సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఎంతో మురిపెంగా పెంచి పెద్ద చేసిన తాత‌య్య మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. అదే రామ్ మ‌న‌స్తాపానికి కార‌ణం.…

త‌న హృద‌యం బ‌ద్ద‌లైంద‌ని యంగ్ హీరో రామ్ ఆవేద‌న‌తో సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఎంతో మురిపెంగా పెంచి పెద్ద చేసిన తాత‌య్య మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. అదే రామ్ మ‌న‌స్తాపానికి కార‌ణం. ఈ నేప‌థ్యంలో భావోద్వేగ పోస్టు పెట్టి, అభిమానుల‌తో త‌న బాధ‌ను పంచుకున్నాడు. కుటుంబం కోసం త‌న తాత చేసిన త్యాగాన్ని స్మ‌రించుకున్నాడు.

‘ విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా తాత‌య్య జీవిత ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబ సభ్యులకు మెరుగైన జీవితం ఇచ్చేందుకు ఆ రోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. 

మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా’ అని రామ్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా 2006లో దేవ‌దాసు చిత్రంతో రామ్ వెండితెర‌పై కెరీర్‌పై ప్రారంభించాడు. ఆ సినిమాలో రామ్ స‌ర‌స‌న ఇలియానా న‌టించారు. దేవ‌దాసు సినిమా రామ్‌కి మంచి పేరు తెచ్చింది. ఫిలింఫేర్ ద‌క్షిణాది ఉత్త‌మ న‌టుడి అవార్డును ఆయ‌న ద‌క్కించుకున్నాడు. 

అప్ప‌టి నుంచి చెప్పుకో త‌గ్గ విజ‌యాల‌ను సొంతం చేసుకుని త‌న‌కంటూ కొంత మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. తాజాగా త‌న తాత మ‌ర‌ణంతో తీవ్రంగా క‌ల‌త చెందినట్టు పోస్ట్ చేయ‌డంతో ఆయ‌న పేరు చ‌ర్చ‌కు వ‌చ్చింది.