భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య మనస్పర్థలు పెరిగితే అవి ఎంతటి విపరీతానికైనా దారితీస్తాయి. దానికి నిజమైన ఉదాహరణగా నిలిచింది ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ఓ భార్య…

అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య మనస్పర్థలు పెరిగితే అవి ఎంతటి విపరీతానికైనా దారితీస్తాయి. దానికి నిజమైన ఉదాహరణగా నిలిచింది ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ఓ భార్య కడతేర్చింది. అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టింది.

జిల్లాలోని ఇల్లెందు పట్టణంలో వినోబా కాలనీలో కల్యాణ్-శైలజ ఉంటున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. కల్యాణిది ఖమ్మం జిల్లా కాగా, శైలజది హైదరాబాద్ లోని నిజాంపేట. ఇల్లెందులో నివశిస్తున్న వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తకు పడడం లేదు. తిట్టుకోవడం, కొట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది.

ఇరుగుపొరుగు వాళ్లు కూడా వీళ్లిద్దర్ని మందలించిన దాఖలాలున్నాయి. 2-3సార్లు కుటుంబ సభ్యుల మధ్య కూడా పంచాయతీ జరిగింది. అయితే ఎంత సయోధ్యకు కుదిర్చినా కల్యాణ్-శైలజ మనసులు మాత్రం కలుసుకోలేదు. వాళ్లిద్దరి మధ్య గొడవలకు అసలు కారణం ఏంటనేది కూడా బంధువులకు తెలియదు.

అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న టైమ్ లోనే భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ చెలరేగింది. ఈసారి అది చాలా పెద్ద గొడవ. ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. దీంతో శైలజలో సహనం నశించింది. కోపం కట్టలు తెచ్చుకుంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో కల్యాణ్ నిద్రిస్తున్న టైమ్ లో అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.

చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలార్పి కల్యాణ్ ను ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 5 గంటల పాటు మృత్యువుతో పోరాడిన కల్యాణ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో శైలజ హంతకురాలిగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోకి పెట్రోల్ ఎలా వచ్చిందనే కోణం నుంచి దర్యాప్తు ప్రారంభించారు.

నాకు స్వయంవరం అంత అవసరమా ?

బాబుకి దెబ్బ మీద దెబ్బ