విశాఖలో వికసించని కమల సేన?

ఒకరిది గ్లామర్, మరొకరిది గ్రామర్, ఒకరు జాతీయ పార్టీ, మరొకరు ప్రాంతీయ పార్టీ, ఇద్దరి కాంబో సూపర్ అన్నారు. మేమే వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం అన్నారు. తీరా చూస్తే తొలి అడుగే తడబడిపోయింది. Advertisement…

ఒకరిది గ్లామర్, మరొకరిది గ్రామర్, ఒకరు జాతీయ పార్టీ, మరొకరు ప్రాంతీయ పార్టీ, ఇద్దరి కాంబో సూపర్ అన్నారు. మేమే వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం అన్నారు. తీరా చూస్తే తొలి అడుగే తడబడిపోయింది.

విశాఖ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ ఘట్టం ముగిసేసరికి  సగానికి పైగా స్థానాల్లో ఈ రెండు పార్టీలకు అసలు ఎంట్రీయే లేదు. అంటే నామినేషన్లే వేయలేదు. మరో వైపు చూసుకుంటే విశాఖ నగర శివార్లు అయిన భీమిలీ, సబ్బవరం, పెందుర్తి వంటి చోట్ల బోణీ కొట్టలేదు.

ఇక ఏజెన్సీలో అయితే ఈ రెండు పార్టీలూ అటువైపుగా ద్రుష్టిపెట్టలేదు. విశాఖ జిల్లాలో 651 ఎంపీటీసీ స్థానాలు ఉంటే రెండు పార్టీలు కలసి 367 స్థానాలకు మాత్రమే నామినేషన్లు వేశాయి. ఇందులో కూడా ఉప ఉప సంహరణ  తరువాత అసలు సీన్ బయటపడనుంది. అంటే ఎందరు మిగులుతారో చూడాలి.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాల్లో చూసుకుంటే విజయనగరం శ్రీకాకుళం లో ఈ కూటమి ఆదిలోనే చతికిల‌పడిపోయిందంటున్నారు. ఇక్కడ కూడా చాలా తక్కువ నామినేషన్లు దాఖలు అయ్యాయి. మరి ఉత్తరాంధ్రాలో బలమైన పార్టీలుగా ముందుకువస్తామని చెబుతున్న బీజేపీ సేనలు లోకల్ ఫైట్ లో ఇలా పరిమితమైపోవడం చూస్తూంటే కూతే ఘనమని అనిపించకమానదు.

నాకు స్వయంవరం అంత అవసరమా ?

బాబుకి దెబ్బ మీద దెబ్బ