బన్నీ రేటు కావాలంటున్న చిరు

రాను రాను నైజాం మార్కెట్ మారిపోతోంది. పైగా నైజాంలో కూడా పెద్ద సినిమాల విడుదల టైమ్ లో టికెట్ లు రేట్లు పెంచుకోవడం మొదలయిన దగ్గర నుంచి పెద్ద పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు…

రాను రాను నైజాం మార్కెట్ మారిపోతోంది. పైగా నైజాంలో కూడా పెద్ద సినిమాల విడుదల టైమ్ లో టికెట్ లు రేట్లు పెంచుకోవడం మొదలయిన దగ్గర నుంచి పెద్ద పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలు అంటే పది నుంచి పది హేను కోట్లు వుండేది. అలా అలా 18 కోట్లకు చేరింది. 

ఇటీవల సంక్రాంతికి బన్నీ సినిమా 18 కోట్లకు, మహేష్ సినిమా 20 కోట్లకు ఎన్నారె చేసారు. కానీ బన్నీ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. అంటే సరైన సినిమా పడితే నలభై కోట్ల స్టామినా నైజాం కు వుందన్న మాట. రాజమౌళి భారీ సినిమాల సంగతి వేరే. ఆయన ఆర్ఆర్ఆర్ ఏకంగా 75 కోట్లు ప్లస్ జిఎస్టి లెక్కన తీసుకున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు నైజాంలో 40 కోట్ల రేటు చెబుతున్నారట. ప్రస్తుతం ఇంకా ఎవరికి హక్కులు ఇవ్వలేదు కానీ ప్రాధమికంగా కోట్ చేస్తున్న రేటు అయితే ఇది అని తెలుస్తోంది. నలభై రాకపోయినా, 35కు తగ్గరు అని టాక్.

మెగాస్టార్-రామ్ చరణ్ వుండడం, కొరటాల శివ దర్శకుడు కావడంతో ఆ రేటు పక్కాగా వర్కవుట్ అవుతుందని ఇండస్ట్రీ జనాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు మహేష్ బాబును తీసుకుంటారని కొంత డిస్కషన్ నడిచింది. ఆఖరికి రామ్ చరణ్ నే వుంటారని ఫిక్స్ అయినట్లు బోగట్టా. అలాగే సినిమా ఆరంభంలో మెగాస్టార్ ఫ్లాష్ బ్యాక్ పెట్టి అందులో చరణ్ వుంటారని అన్నారు. 

కానీ తరువాత తరువాత జరిగిన స్క్రిప్ట్ మార్పుల్లో, రామ్ చరణ్ పాత్ర మారినట్లు బోగట్టా. పట్నం నుంచి అడవికి వచ్చి ఆచార్యకు శిష్యుడిగా మారే పాత్రను రామ్ చరణ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?