రాజకీయ నాయకులు సినిమాల్లో చేస్తుంటే ఇలాగే వుంటుంది. సెట్ లో వాళ్ల సెక్యూరిటీ హడావుడి ఎక్కువ వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా వ్యవహారం ఇలాగే వుంది. సెట్ లో సెక్యూరిటీ జనాల హడావుడి ఎక్కువగా వుందట. దీనికి కారణం మరేం లేదు సినిమాలో హీరో, మరో కీలకపాత్రధారి ఇద్దరికీ రాజకీయ నేపథ్యం వుండడమే కారణం.
హీరో పవన్ కళ్యాణ్ సంగతి చెప్పనక్కరలేదు. ఆయన జనసేన పార్టీ అధినేత. పాపులర్ హీరో. అందువల్ల ప్రయివేటు సెక్యూరిటీ, అధికారిక సెక్యూరిటీ రెండూ వున్నాయి. ఇదే సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఆయన పవన్ ను ఢీకొనే లాయర్ పాత్రను పోషిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ కూడా రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఆయనకు కూడా కాస్త థ్రెట్ వుంది. అందుకే ఆయనకు కూడా అధికారికంగా సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇటు పవన్ సెక్యూరిటీ, అటు ప్రకాష్ రాజ్ సెక్యూరిటీ కలిసి వకీల్ సాబ్ సెట్ లో సందడిగా వుంటోంది.
సెట్ లో నటుల కన్నా సెక్యూరిటీనే ఎక్కువ అన్న జోక్స్ వినిపిస్తున్నాయి.