బన్నీతో సినిమా.. ఓ ఫేక్ న్యూస్

ఒక దర్శకుడు హిట్ కొట్టాడంటే చాలు, అతడి కాంబినేషన్ లో సినిమా అంటూ పుకార్లు వ్యాపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే మరో పుకారు టాలీవుడ్ ను ఊపేస్తోంది. అదే బన్నీ-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్. ముందే చెప్పుకున్నట్టు…

ఒక దర్శకుడు హిట్ కొట్టాడంటే చాలు, అతడి కాంబినేషన్ లో సినిమా అంటూ పుకార్లు వ్యాపిస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే మరో పుకారు టాలీవుడ్ ను ఊపేస్తోంది. అదే బన్నీ-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్. ముందే చెప్పుకున్నట్టు ఇది పుకారు మాత్రమే. ఎంతమాత్రం నిజం లేదు.

విక్రమ్ తో హిట్ కొట్టాడు లోకేష్ కనగరాజ్. ఆ వెంటనే బన్నీ హీరోగా లోకేష్ దర్శకత్వంలో సినిమా అంటూ కథనాలు వచ్చేశాయి. ఇది వాస్తవం కాదు. బన్నీ ప్రస్తుతం పుష్ప-2పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ఆ కథా చర్చల్లోనే తలమునకలై ఉన్నాడు.

నిజానికి బన్నీ లిస్ట్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు ఉంది. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పుష్ప-2 సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును గ్రాండ్ గా ఎనౌన్స్ చేస్తాడు బన్నీ. అంతా అనుకుంటున్నట్టు పుష్ప-2 తర్వాత ఐకాన్ అనే సినిమా రాదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రావాల్సిన ఈ సినిమాను దాదాపు పక్కనపెట్టాడు అల్లు అర్జున్. ఈ విషయాన్ని రీసెంట్ గా దిల్ రాజు కూడా కన్ ఫర్మ్ చేశాడు.

సో.. బన్నీ చేతిలో ఓ సర్ ప్రైజింగ్ ప్రాజెక్టు ఉందనేది వాస్తవం. కానీ అది లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు కాదనేది కూడా అంతే వాస్తవం. ప్రస్తుతానికి ఇంతే. పుష్ప-2 తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుంది.