ఐటెంసాంగ్ సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన డీఎస్పీ

టాలీవుడ్ లో చాలామంది సంగీత దర్శకులున్నారు. అందరూ అన్ని సందర్భాల్లో కాకపోయినా, చాలా సందర్భాల్లో మంచి సాంగ్స్ ఇస్తున్నారు. అయితే ఐటెంసాంగ్స్ విషయానికొచ్చేసరికి మాత్రం స్టడీగా హిట్స్ ఇస్తున్న ఒకే ఒక్క సంగీత దర్శకుడు…

టాలీవుడ్ లో చాలామంది సంగీత దర్శకులున్నారు. అందరూ అన్ని సందర్భాల్లో కాకపోయినా, చాలా సందర్భాల్లో మంచి సాంగ్స్ ఇస్తున్నారు. అయితే ఐటెంసాంగ్స్ విషయానికొచ్చేసరికి మాత్రం స్టడీగా హిట్స్ ఇస్తున్న ఒకే ఒక్క సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాత్రమే. దేవీ ఒక్కడే ఐటెంసాంగ్స్ కు బెస్ట్ ఆప్షన్ అయ్యాడు. ఈ విషయంలో అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటి?

“మెలోడి,  ఐటెం సాంగ్స్ కి ఒక తేడా వుంది. మెలోడి కి ఒక బేస్ ఉంటుంది. సన్నివేశం, కథ ఇలా ఎదో ఒక ఆధారం ఉంటుంది. కానీ ఐటెం సాంగ్ వినోదం కోసమే ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఒక రూలు కూడా ఉండదు. ఎప్పుడైతే రూలు ఉండదో ఆప్షన్స్ పెరుగుతాయి. ఏ బేస్ మీద ముందుకెళ్లాలనే ఆలోచన వస్తుంది. అయితే నా వరకూ ఒక కంపోజర్ గా కంటే మ్యూజిక్ లవర్ గానే ఉంటా. ముందు మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను. ఒక ట్యూన్ కంపోజ్ చేసి దీనికి నేను డ్యాన్స్ చేస్తానా లేదా అని చూసుకుంటా. ట్యూన్ కంపోజ్ చేసినప్పుడే నాకు ఒక ఊపు వచ్చిందంటే అందరికీ ఆ జోష్ వస్తుందని నమ్ముతా. బహుశా ఐటెంసాంగ్స్ సక్సెస్ విషయంలో అదే నా సీక్రెట్ కావొచ్చు.”

ఇలా ఐటెంసాంగ్స్ విషయంలో తన సక్సెస్ సీక్రెట్ ను బయటపెట్టాడు దేవిశ్రీ. తాజాగా ఎఫ్3 సినిమాకు ఐటెంసాంగ్ ఇచ్చాడు దేవిశ్రీ. పూజాహెగ్డే డాన్స్ చేసిన ఈ సాంగ్ కూడా హిట్టవ్వడం తనకు చాలా ఆనందంగా ఉందన్నాడు.

ఓ పాట ఏ రేంజ్ వరకు వెళ్తుందనేది ప్రతి సంగీత దర్శకుడికి ముందుగానే తెలిసిపోతుందంటున్నాడు దేవిశ్రీ ప్రసాద్. పాట హిట్టవుతుందా అవ్వదా అనే విషయాన్ని కంపోజర్ మనసు ముందుగానే చెప్పేస్తుందట. అలా తన మనసు చెప్పిన పాటలన్నీ సక్సెస్ అయ్యాయని చెబుతున్నాడు.

రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖీ, ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాల ఆల్బమ్స్ శ్రోతలకు పెద్దగా రీచ్ కానప్పటికీ.. ఆ సినిమాల టైమ్ లో తన మ్యూజికల్ జర్నీని బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు ఈ సంగీత దర్శకుడు. ఇండస్ట్రీలో సంగీత దర్శకుల మధ్య పోటీ ఉండదని ఈ సందర్భంగా మరోసారి స్పష్టంచేశాడు డీఎస్పీ.