ఈసారి సంక్రాంంతికి బన్నీ అక్కడే

సంక్రాంతి అంటే, వెస్ట్ గోదావరి, కోడిపందాలు ఎక్స్ ట్రా.. ఎక్స్ ట్రా.. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు చూసి తీరాల్సిందే. బహుశా అందుకే కావచ్చు, అల్లుఅర్జున్ ఈసారి సంక్రాంతికి ఛలో పాలకొల్లు అంటున్నట్లు తెలుస్తోంది.…

సంక్రాంతి అంటే, వెస్ట్ గోదావరి, కోడిపందాలు ఎక్స్ ట్రా.. ఎక్స్ ట్రా.. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు చూసి తీరాల్సిందే. బహుశా అందుకే కావచ్చు, అల్లుఅర్జున్ ఈసారి సంక్రాంతికి ఛలో పాలకొల్లు అంటున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లు అంటే అల్లువారి స్వంత ఊరు.

మెగా ఫ్యామిలీ మూలాలే వెస్ట్ గోదావరిలో వున్నాయి. అందుకే ఈసారి సంక్రాంతికి బన్నీ తన ఫ్యామిలీ మెంబర్లతో పాలకొల్లు వెళ్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మామూలుగానే గోదావరి జిల్లాల కుర్రకారు సంక్రాంతికి భీమవరం, నరసాపుర, పాలకొల్లు పరిసర ఫ్రాంతాల్లో వాలిపోతారు. అలాంటిది ఈసారి బన్నీ కూడా అక్కడే వుంటున్నాడని తెలిస్తే మరీ రెడీ అయిపొతారేమో?

ప్రస్తుతం బన్నీ ఖాళీగా వున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ తయారీలో బిజీగా వున్నారు. అది రెడీ అయితే సినిమా సెట్ మీదకు వెళ్లాలి. స్క్రిప్ట్ రెడీ అయ్యాక కానీ స్టార్ట్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ ఫైనల్ కావు. అంతవరకు బన్నీ హ్యాపీగా విదేశాలు, స్వదేశం చుట్టేయడమే పని.

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు

వివాదాలు.. వైఫల్యాలు.. వివాహాలు..!