ఏపీలో స్మార్ట్ సిటీస్ కు 6,871 కోట్ల ఖ‌ర్చు

స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్ట్స్ కింద విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలలో 6,871 కోట్ల రూపాయలతో చేపట్టిన మొత్తం 195 ప్రాజెక్ట్‌  పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నట్లు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి…

స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్ట్స్ కింద విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలలో 6,871 కోట్ల రూపాయలతో చేపట్టిన మొత్తం 195 ప్రాజెక్ట్‌  పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నట్లు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. 

రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఇప్పటి వరకు 828 కోట్ల రూపాయలు వెచ్చించి 64 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ మూడు నగరాలలో 4,691 కోట్ల వ్యయం అయ్యే 100 ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లు జారీ చేసినట్లు తెలిపారు.

అలాగే 888 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 20 ప్రాజెక్ట్‌లకు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. స్మార్ట్‌ సిటీస్‌ కింద ఎంపికైన అయిదేళ్ళ వ్యవధిలో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

సీఎంను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?