‘రెడ్’ ఆంధ్ర @ 9 కోట్లు

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కావడం హీరో రామ్ లేటెస్ట్ సినిమా బిజినెస్ ను కాస్త సులువు చేసినట్లే కనిపిస్తోంది. హీరో రామ్ తన స్వంత బ్యానర్ మీద తమిళ సినిమా 'తడమ్' ను రీమేక్…

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కావడం హీరో రామ్ లేటెస్ట్ సినిమా బిజినెస్ ను కాస్త సులువు చేసినట్లే కనిపిస్తోంది. హీరో రామ్ తన స్వంత బ్యానర్ మీద తమిళ సినిమా 'తడమ్' ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో డబుల్ రోల్ కీలకం. ఇద్దరు హీరోలు కలిసి ఎలా డ్రామా ఆడి కోర్టును మాయచేసి, నిర్దోషులుగా బయటకు వచ్చారన్నది కీలకపాయింట్.

రెడ్ అనే పేరుతో తయారవుతున్న ఈ సినిమా సమ్మర్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను మార్కెట్ చేయడం ప్రారంభించారు. ఆంధ్ర ను తొమ్మిది కోట్లరేషియోలో కట్ చేసారు. ఏరియాల వారీగా బయ్యర్లకు ఇచ్చేసారు. తొమ్మిది కోట్ల రేషియో అంటే మంచి రేటు వచ్చినట్లే అనుకోవాలి.

ఇస్మార్ట్ శంకర్ విజయం వల్ల, ఈ సీజన్ లో సరైన పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల బయ్యర్లు మంచి రేటు ఇచ్చినట్లు అనుకోవాలి. సీడెడ్ ను నాలుగు కోట్ల రేషియోలో ఇచ్చినట్లు తెలుస్తోంది. . నైజాం ఏరియా ఇంకా ఫిక్స్ కావాల్సి వుందని తెలుస్తోంది.

సీఎంను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు