కొంత మంది సెలబ్రిటీల వ్యవహారం చూస్తుంటే రానున్న రోజుల్లో బెడ్‌రూమ్‌ను కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేలా ఉన్నారు. సంసారం గుట్టు, వ్యాధి రట్టు అని పెద్దలు చెబుతారు. అంటే సంసారాన్ని బజారున పడనీయకుండా, గుట్టుగా సాగించాలనేది పెద్దలు మనకు నేర్పిన సంస్కారం. కానీ పెద్దల మాటలిప్పుడు పట్టించుకునే వారు క్రమంగా కరువవుతున్నారు.
కామ్యా పంజాబీ…తెలుగు వాళ్లకు పరిచయం లేని పేరు. కానీ హిందీ వాళ్లకు బాగా పరిచయం ఉన్నపేరు. ఆమె టీవీ ప్రముఖ నటి. అంతేకాదు బిగ్‌బాస్ రియాలిటీ షో ఏడవ సీజన్లో కామ్యా పంజాబీ పోటీదారు. ఆమె తన రెండో భర్త షాలబ్ డాంగ్‌తో ముద్దూ ముచ్చట్లకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 9న మెహందీ వేడుకను నిర్వహించడంతో పాటు ఆ మరుసటి రోజు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
‘నేను ఎంతో అదృష్టవంతురాలిని. షలాబ్ డాంగ్, ఐ లవ్ యూ’ అంటూ క్యాప్షన్‌తో కామ్యా పంజాబీ తన భర్త ముద్దు ఇస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. కామ్యాకు గతంలో వ్యాపారవేత్త బంటీనెగితో వివాహమైంది. ఆమెకు పదేళ్ల కూతురు ఉంది. 40 ఏళ్ల కామ్యా గత ఏడాది ఫిబ్రవరిలో షాలబ్ డాంగ్‌ను ఓ స్నేహితుడి ద్వారా కలిసింది. షాలబ్‌తో ప్రేమలో పడిన కామ్యాకు…బంటీ అంటే ‘నెగి’టీవ్ ఫీలింగ్ ఏర్పడింది.
దీంతో ఆమె బంటీ నుంచి విడాకులు తీసుకున్నారు. గత నెల 10న కామ్యా , షాలబ్ డాంగ్ పెళ్లి చేసుకున్నారు. తమ ముద్దూముచ్చటనూ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో ఆమె పంచుకున్నారు.
కామ్యా పంజాబీ బానూ మైనే తేరి దుల్హాన్, పర్వారీష్, కుచ్ ఖట్టీ కుచ్ మీఠీ, మరియాడా, లెకిన్ కబ్ తక్? హిందీ సీరియల్స్‌లలో నటించి ప్రముఖ టీవీ నటిగా పేరొందారు. టీవీ ప్రముఖ నటి తన రెండో భర్తతో ముద్దూముచ్చట్లు జరిపిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కామ్యా వలపు, వయ్యారాలను చూస్తుంటే బెడ్‌రూమ్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేలా ఉన్నారే అని కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు.