ఎన్టీఆర్ బయోపిక్… ఇప్పుడు టాక్ ఆఫ్ టాలీవుడ్. బయోపిక్ నిర్మాతల్లో ఒకరైన ఇందూరి విష్ణు మదిలో పిల్లకాలవలా పుట్టిన అయిడియా. డైరక్టర్ క్రిష్ తోడుకావడంతో నిండు గోదావరిలా మారింది. టాలీవుడ్ లో ఏకగ్రీవంగా వినిపించే అభిప్రాయం ఒక్కటే. డైరక్టర్ క్రిష్ కాకపోతే బయోపిక్ బజ్ ఇలా వుండేది కాదు, బయోపిక్ ఇలా వచ్చి వుండేది కాదు. బయోపిక్ లో ఇంతమంది నటులు చేరి వుండేవారు కాదు. అవి వాస్తవం.
ఎందుకంటే దర్శకుడు తేజకు ఆ స్టామినా వుందా? అన్నది అనుమానం. తేజ కూడా మొదట్లో అందరూ కొత్తవాళ్లు, థియేటర్ ఆర్టిస్టులతో చేయాలని అనుకున్నారు. అప్పుడు ఈ రేంజ్ బజ్ రమ్మన్నా వచ్చి వుండేది కాదు. మరి ఇంత కీలకమైన మార్పులకు కారణమైన దర్శకుడు క్రిష్ కు రెమ్యూనిరేషన్ ఎంత ఇచ్చి వుంటారు? ఇప్పుడు టాప్ డైరక్టర్ లు అందరూ పదిహేను నుంచి ఇరవై కోట్లు తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ దాదాపు 100 కోట్ల వ్యాపారం చేసింది. అందువల్ల క్రిష్ కు ఆ రేంజ్ లో రెమ్యూనిరేషన్ అంది వుంటుందా? ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం డైరక్టర్ క్రిష్ కు బయోపిక్ కు గాను ఇచ్చిన రెమ్యూనిరేషన్ 10కోట్లు అని తెలుస్తోంది.
ఈ మేరకు క్రిష్ దర్శకత్వ పగ్గాలు చేపట్టినపుడే డిసైడ్ అయిపోయిందట. అంటే ఎన్టీఆర్ బయోపిక్ ఓ షేప్ తీసుకోక ముందే, ఈ మేరకు బజ్ రాకముందే, బిజినెస్ కాకముందే అన్నమాట. అందుకే అప్పట్లో పది కోట్లకు ఫిక్స్ అయిపోయింది. ఈ పదికోట్ల ఫిగర్ కు కూడా ఓ కారణం వుందని తెలుస్తోంది.
క్రిష్ కు పదికోట్ల ఆబ్లిగేషన్ లేదా కమిట్ మెంట్ ఏదో వుందని తెలుస్తోంది. అది తెలిసి బాలయ్య, ఆ మేరకు భరోసా ఇచ్చి దర్శకత్వ పగ్గాలు క్రిష్ చేతిలో వుంచినట్లు తెలుస్తోంది. ఏమాటకు ఆమాటే చెప్పుకొవాలి. ప్రెజెంట్ ట్రెండ్ తో పొల్చుకుంటే ఇది తక్కువే.