రేపట్నుంచి వైన్ షాపులు మూసేస్తారా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా వైన్ షాపుల ముందు బార్లు కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే దాదాపు అన్ని షాపుల ముందు మందు బాబులు క్యూ కట్టారు. ఎన్నడూ లేని విధంగా…

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా వైన్ షాపుల ముందు బార్లు కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే దాదాపు అన్ని షాపుల ముందు మందు బాబులు క్యూ కట్టారు. ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకేసారి వందల సంఖ్యలో మందుబాబులు క్యూ కట్టడంతో వైన్ షాపు ఉద్యోగులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే..

స్థానిక ఎన్నికల నేపథ్యంలో రేపట్నుంచి ఇక మద్యం దొరకదనే ప్రచారం ఏపీ అంతటా వ్యాపించింది. రేపట్నుంచి 29 వరకు రాష్ట్రంలో అన్ని మద్యం షాపులు మూసేస్తారని, ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే పుకారు వ్యాపించింది. దీంతో మందుబాబులు షాపుల ముందు క్యూ కడుతున్నారు.  

వీలైనంత ఎక్కువ లిక్కర్ బాటిల్స్ కొనుక్కునేందుకు మద్యంప్రియులు ఎగబడుతున్నారు. అయితే ఆల్రెడీ అమల్లో ఉన్న పాలసీ ప్రకారం, ఒక వ్యక్తికి 3 బాటిళ్లు మాత్రమే ఇస్తారు. దీంతో తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా కూడా మందు కొనిపించుకుంటున్నారు కొంతమంది. అయితే షాపుల్లో కూడా స్టాక్ ఎక్కువగా ఉండదు. ఈ నిబంధన కూడా అమల్లో ఉంది. దీంతో మందుబాబులు తలలు పట్టుకున్నారు.

కానీ నిజం ఏంటంటే.. రేపట్నుంచి మద్యం షాపులు మూసేయడం లేదు. షాపుల్లో స్టాక్ కూడా తగ్గించడం లేదు. కేవలం ఇదొక అపోహ మాత్రమే. స్వయంగా అధికారులు, కొంతమంది నేతలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఈ అనుమానాలు వీడడం లేదు.

సీఎంను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?