మోడీ ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారు. హోదా ఇవ్వలేదు.. రైల్వే జోన్ ఇవ్వలేదు. పోర్టు ఇవ్వలేదు. ఇదీ చంద్రబాబు టముకేస్తున్న వైనం. సరే, ఆ సంగతి అలా వుంచుందాం? అసలు ఏమి ఇచ్చారో? చెప్పవచ్చు కదా? స్వఛ్ భారత్ కింద లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి కోట్లు ఇచ్చామంటున్నారు. ప్రతి ఊళ్లో ఇళ్ల నిర్మాణానికి సహాయంగా కోట్లు ఇచ్చామంటున్నారు. ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కోట్లకు కోట్లు కేంధ్రం విడుదల చేసిందంటున్నారు.
ఇలా చాలా వుంది జాబితా. మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. కేంద్రం అయిదేళ్లలో ఏయే విధమైన నిధులు ఇచ్చిందో? ఏయే నిధులకు రాష్ట్రం లెక్కలు చెప్పిందో? వేటికి చెప్పలేదో? ఏయే నిధులు, ఏ విధంగా వెనక్కు తీసుకున్నారో? డిటైల్స్ గా ఓ శ్వేతపత్రం విడుదల చేయవచ్చు కదా? వట్టినే ఆరోపణలు చేయడం కన్నా ఇది బెటర్ కదా?
ఏ పద్దు కింద ఎంతెంత ఈ అయిదేళ్లలో కేంద్రం ఇచ్చిందో వివరంగా ఓ శ్వేతపత్రం ఇస్తే పని సులువు కదా? బాబు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో? అలా చేస్తే కేంద్రం ఇన్ని వేలకోట్లు రాష్ట్రానికి ఇస్తోందని అర్థం అయిపోతుందనే అనుమానం ఏమో?