మజ్ఞు – స్ట్రెస్ పూర్తిగా పోయింది

వెంకీ అట్లూరి-అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా మిస్టర్ మజ్ఞు. ఈ సినిమా మరో మూడువారాల్లో విడుదలవుతుంది. ఫ్రస్తుతానికి టీజర్ బయటకు వచ్చింది. అచ్చమైన కాసనోవా క్యారెక్టర్ చేస్తున్నాడు హీరో అఖిల్…

వెంకీ అట్లూరి-అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా మిస్టర్ మజ్ఞు. ఈ సినిమా మరో మూడువారాల్లో విడుదలవుతుంది. ఫ్రస్తుతానికి టీజర్ బయటకు వచ్చింది. అచ్చమైన కాసనోవా క్యారెక్టర్ చేస్తున్నాడు హీరో అఖిల్ ఈ సినిమాలో. టీజర్ లో ఆ విషయాన్నే క్లియర్ గా ప్రస్తావిస్తూ, పనిలో పనిగా సిక్స్ ప్యాక్ బాడీకి పనికివచ్చే, ఫైట్లు, డ్యాన్స్ లు కూడా జోడించారు.

అఖిల్ డిక్షన్ స్టయిల్ ను కొంచెం మార్చినట్లు వినిపించింది టీజర్ లో. యూత్ ఫుల్ డైలాగులు ఒకటి రెండు టీజర్ లో చొప్పించారు. పనిలో పనిగా, హీరో పాప పరిహారం అన్నట్లుగా..'' ప్రపంచంలో వున్న అమ్మాయిలు అందరూ నా ఒక్కడి కోసమే పుట్టలేదు. వాళ్లకీ ఓ లైఫ్ వుంటుంది. ఐ రెస్పెక్ట్ దట్..'' అనే డైలాగును టీజర్ లో చివర్న వుంచారు.

టోటల్ గా టీజర్ ను ఓ యూత్ ఫుల్ ఫ్యాకేజ్ గా తయారుచేసినట్లుంది. రొమాంటిక్ సీన్లు, డైలాగులు, డ్యాన్స్ మూవ్ మెంట్లు, ఫైట్ సీక్వెన్స్ లు, ఇవనీ ఈ ప్యాకేజ్ లో చేర్చినవి. టీజర్ కు థమన్ ఇచ్చిన ఆర్ ఆర్ బాగుంది. టోటల్ గా మిస్టర్ మజ్ఞు సినిమా గురించి కాస్త మాట్లాడుకోవడం ఇక ప్రారంభమవుతుంది.

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు

ప్రతి డైరీలో.. ప్రతి పేజీ హాయిగా సాగిపోనీ!