టాలీవుడ్ లో ఇటీవల ప్రీమియర్స్ అన్నది క్రేజ్ గా మారింది. పెద్ద సినిమాలు లేదా క్రేజ్ వున్న సినిమాలు వస్తే ముందురోజు ఫ్యాన్స్ కోసం స్పేషల్ షోలు వేయడం, లేదా సినిమా జనాల కోసం స్పేషల్ ప్రీమియర్ ప్రదర్శించడం అన్నది కామన్. ఇక హీరో బాలయ్య సినిమాలకు అయితే ఫ్యాన్స్ షోలు మస్ట్.
బాహుబలి నుంచి సులువైన వ్యవహారం ఒకటి స్టార్ట్ అయింది. విడుదలను, రిలీజ్ డే ముందురోజు రాత్రి సెకెండ్ షో లతో స్టార్ట్ చేయడం అన్నది మొదలు పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో బాలయ్య లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుకు ఏం చేస్తారు అన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది.
క్రిష్-బాలకృష్ణ కాంబో గౌతమీపుత్ర శాతకర్ణకి ఫ్యాన్స్ షోలు పడ్డాయి. అయితే తెలంగాణలో అర్థరాత్రి, తెల్లవారు ఝాము ఆటలకు అనుమతి ఇవ్వడంలేదు. ఎవరి సినిమా అయినా ఒకటేరూలు. కావాలంటే ఉదయాన్నే వేసుకునే అవకాశం వుంది.
మరి బయోపిక్ కు ఏం చేస్తారు? ఆంధ్రలో ఎలాగూ సంక్రాంతికి అన్ని సినిమాలకు రోజుకు అయిదారు ఆటలు వేసుకునే విధంగా ప్రభుత్వం జీవో ఇచ్చేస్తుంది. అది ఈ మధ్య కామన్ అయిపోయింది. అలాగే ఆంధ్రలో ఫ్యాన్స్ షోలకు సమస్య వుండదు.
పైగా బయోపిక్ ను బయ్యర్లు భారీ రేట్లకు కొన్నారు కాబట్టి, ఫ్యాన్స్ షోల వైపే మొగ్గు చూపుతారు. అయితే భారీ రేట్లకు కొన్నందున ఫ్యాన్స్ షోలకు కొన్నందును ఫ్యాన్స్ షోలకు భారీరేట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఏరియాలో ఫ్యాన్స్ షో లకు బల్క్ రేటు కాకుండా, థియేటర్ షీటింగ్ ను బట్టి రేటు చెబుతున్నట్లు వినిపిస్తోంది.
సీటింగ్ ప్రకారం టికెట్ కు వెయ్యి రూపాయలు అడగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ కూకట్ పల్లి, కృష్ణా, గుంటూరు, సీడెడ్ ల్లో అయితే బాలయ్య సినిమాకు డిమాండ్ ఎక్కువ. విశాఖలో అంత రేంజ్ లో వుండదు. కానీ ప్రస్తుతానికి రేట్లు ఇలా చెబుతున్నారని తెలుస్తోంది.
మరోపక్క మరీ ముందుగా షోలు వేయడం అన్నదానికి దర్శకుడు క్రిష్ అంత సుముఖంగా లేరని వినిపిస్తోంది. రెగ్యులర్ షోల కన్నా ఒకటి రెండు గంటలు ముందుగా షోలు వేయడం బెటర్ అనే ఆలోచనతో ఆయన వున్నారని తెలుస్తోంది.
ఎలాగూ సినిమా బుధవారం విడుదలవుతోంది. అంటే చాలా ముందుగా విడుదల అవుతున్నట్లే. అందువల్ల ఇంకా ముందుకు తీసుకువచ్చి మంగళవారం వేయడం ఎందుకనే ఆలోచనలో ఆయన వున్నట్లు తెలుస్తోంది.