రెండుగా చీలిన వెంకటేష్ ఫ్యాన్స్

ఒక్కపుకారు, ఒకే ఒక్క పుకారు.. దగ్గుబాటి వీరాభిమానుల్ని రెండుగా చీల్చింది. ఎంతలా అంటే ఆ రూమర్ పై రేపోమాపో వెంకీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం రావొచ్చు. అవును.. వెంకటేష్ కు సంబంధించిన ఓ మేటర్…

ఒక్కపుకారు, ఒకే ఒక్క పుకారు.. దగ్గుబాటి వీరాభిమానుల్ని రెండుగా చీల్చింది. ఎంతలా అంటే ఆ రూమర్ పై రేపోమాపో వెంకీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం రావొచ్చు. అవును.. వెంకటేష్ కు సంబంధించిన ఓ మేటర్ పై భిన్న ధృవాలుగా మారారు అతడి అభిమానులు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. స్టార్ మాకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్-3కి వెంకీ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారనేది ఆ న్యూస్. తెలుగులో ఈ సీజన్ ను ఎన్టీఆర్ ప్రారంభించగా, నాని కొనసాగించాడు. ఇప్పుడు మూడోసీజన్ కోసం వెంకీని సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే అభిమానులు రెండుగా విడిపోయారు.

బిగ్ బాస్ గా వ్యవహరించొద్దని ఓ వర్గం అంటోంది. లేదు కచ్చితంగా బిగ్ బాస్ చేయాల్సిందేనంటోంది మరోవర్గం. ఎవరి రీజన్స్ వాళ్లకున్నాయి. బిగ్ బాస్ చేయడం ద్వారా అన్ని ఇళ్లకు వెంకీ దగ్గరవుతాడని, ఫ్యాన్ బేస్ తో పాటు క్రేజ్ ఇంకాస్త పెరుగుతుందని ఓ వర్గం వాదిస్తోంది. మరోవర్గం మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తంచేస్తోంది.

మిస్టర్ క్లీన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వెంకటేష్, బిగ్ బాస్ షో చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ వర్గం భయపడుతోంది. గతంలో చాలా సందర్భాల్లో నాని ఇలానే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకదశలో అతడి సినిమాపై కూడా ఆ ప్రభావం పడింది. వెంకీకి కూడా అలాంటి ఘటనలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఈ వర్గం ఆందోళన చెందుతోంది.

నిజానికి ఈ రెండు వర్గాలకు చెందిన అభిమానుల వాదనల్లో నిజం ఉంది. బిగ్ బాస్ గా వ్యవహరించే వ్యక్తికి ఎంత క్రేజ్ వస్తుందో, అదేస్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రేజ్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు కానీ వివాదాలు ఎదురైతే రియాక్ట్ అయ్యేంత సీన్ వెంకీకి లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ హీరో చాలా వీక్.

ఈ వాదనల మాట ఎలా ఉన్నప్పటికీ స్టార్ మా యాజమాన్యం మాత్రం వెంకీతో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉంది. మేటర్ ఏదైనా అది సురేష్ బాబును దాటివెళ్లాలి. ప్రస్తుతం ఈ డీల్ అక్కడే ఆగింది. ఏమౌతుందో చూడాలి. 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు

ప్రతి డైరీలో.. ప్రతి పేజీ హాయిగా సాగిపోనీ!