ఎన్టీఆర్ నో చెప్పాడు.. అల్లుఅర్జున్ ఏం చేస్తాడో?

త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్.. ఒకప్పుడు సిమెంట్-ఇసుకలా కలిసిపోయిన బంధమిది. కానీ ఏదో జరిగింది, ఇద్దరూ విడిపోయారు. దేవిశ్రీని కాదని అనిరుధ్ ను తెరపైకి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి సినిమా ప్రచారంలో పవన్ కంటే ఎక్కువగా అనిరుధ్ కే…

త్రివిక్రమ్-దేవిశ్రీప్రసాద్.. ఒకప్పుడు సిమెంట్-ఇసుకలా కలిసిపోయిన బంధమిది. కానీ ఏదో జరిగింది, ఇద్దరూ విడిపోయారు. దేవిశ్రీని కాదని అనిరుధ్ ను తెరపైకి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. అజ్ఞాతవాసి సినిమా ప్రచారంలో పవన్ కంటే ఎక్కువగా అనిరుధ్ కే ప్రచారం దక్కిందంటే అది దేవిశ్రీ చలవే. అయితే ఆ తర్వాత దేవిశ్రీ మాట చెల్లలేదు.

అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమేత ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ పేరుతో పాటు సమాంతరంగా అనిరుధ్ పేరు కూడా ప్రకటించేశాడు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. అలాఅని దేవిశ్రీతో కలిసి పనిచేయడానికి త్రివిక్రమ్ మనసు ఒప్పుకోలేదు. దీంతో మధ్యేమార్గంగా తమన్ తో పని కానిచ్చేశారు.

ఇప్పుడీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బన్నీతో సినిమా ఎనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఈసారి కూడా అనిరుధ్ పేరును తెరపైకి తీసుకొచ్చాడు. కానీ త్రివిక్రమ్ మాట చెల్లుబాటు అయ్యేలా కనిపించడం లేదు. అసలే బన్నీ-దేవిశ్రీ బెస్ట్ ఫ్రెండ్స్. పైగా త్రివిక్రమ్-బన్నీ-దేవిశ్రీది సూపర్ హిట్ కాంబినేషన్ కూడా. ఇలాంటి టైమ్ లో దేవిశ్రీని త్రివిక్రమ్ వద్దంటే అది బన్నీకి కోపం తెస్తుంది.

పైగా నాపేరు సూర్య ఫ్లాప్ తర్వాత రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు బన్నీ. సో.. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటే ఈసారి త్రివిక్రమ్ కు దేవిశ్రీతో కలిసి పనిచేయక తప్పేలాలేదు. పైగా రీసెంట్ గా జరిగిన వినయ విధేయ రామ ఫంక్షన్ లో త్రివిక్రమ్-దేవిశ్రీ బాగానే మాట్లాడుకున్నారు. స్టేజ్ పై ఒకర్నొకరు కౌగిలించుకున్నారు కూడా. ఆ ఆత్మీయత ఎంత నిజమో బన్నీ సినిమాతో తేలిపోతుంది.

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు

ప్రతి డైరీలో.. ప్రతి పేజీ హాయిగా సాగిపోనీ!