అచ్చమైన సంక్రాంతి సినిమా

తమళ సూపర్ స్టార్ ల్లో ఒకరైన అజిత్ వ్యవహారం, ఆయన సినిమాలే వేరు. తాజగా అజిత్ సినిమా విశ్వాసం ట్రయిలర్ బయటకు వచ్చింది. మాస్ సినిమాలు బ్రహ్మాండంగా అందించే శివ దర్శకుడు. విశ్వాసం సినిమా సంక్రాంతి…

తమళ సూపర్ స్టార్ ల్లో ఒకరైన అజిత్ వ్యవహారం, ఆయన సినిమాలే వేరు. తాజగా అజిత్ సినిమా విశ్వాసం ట్రయిలర్ బయటకు వచ్చింది. మాస్ సినిమాలు బ్రహ్మాండంగా అందించే శివ దర్శకుడు. విశ్వాసం సినిమా సంక్రాంతి తరువాత థియేటర్లలోకి రాబోతోంది కానీ, సినిమా ట్రయిలర్ చూస్తే మాత్రం అచ్చమైన సంక్రాంతి సినిమా మాదిరగా వుంది. 

సినిమాలో సీన్లు, ఇతరత్రా వ్యవహారాలు కొత్తగా ఏమీ లేవు. కానీ పక్కా ఫార్ములా ప్రకారం, కమర్షియల్ సినిమాను లైక్ చేసే వారిని, అజిత్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని, పాళ్లు అన్నీ రంగరించి తయారుచేసినట్లు కనిపిస్తోంది.

అజిత్ తెల్లటి గుబురు మీసాలతో, పల్లెటూరి పెదరాయుడి మాదిరగా భలేగా వున్నాడు. ఫైట్లు, భారీ జనాలతో కూడిన పాటలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ కచ్చితంగా పక్కాగా సమపాళ్లలో మిక్స్ అయ్యాయి. అందువల్ల ఇలాంటి సినిమా సంక్రాంతికి వస్తే భలే రంజుగా వుంటుంది. కానీ జనవరి మూడోవారంలో విడుదలవుతోంది.

ఆ టైమ్ లో మన తెలుగు సినిమాలు కూడా రెండు మూడు షెడ్యూలు అయి వున్నాయి. విశ్వాసం తెలుగు డేట్ ఫిక్స్ అయితే వీటి సంగతి మారే అవకాశం వుంది.