భరత్ అనే నేను సినిమాకు ఆ సాంగ్ ఎంత అట్రాక్షన్ అన్నది అందరికీ తెలిసిందే. వచ్చాడయ్యా సామీ.. అంటూ సాగిన ఆ పాటను దర్శకుడు కొరటాల శివ, బాహుబలి సినిమా గుర్తుకు వచ్చే రేంజ్ లో, లైటింగ్ మూడ్ లో, కలర్ స్కీమ్ లో చిత్రీకరించారు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్లులను ఆ పాట కోసం ఎంగేజ్ చేసారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఇదే మ్యాజిక్ ను రిపీట్ చేసే పని చేస్తున్నారు. దిల్ రాజు, పివిపి, అశ్వనీదత్ కలిసి నిర్మించే మహర్షి సినిమాలో ఈ రేంజ్ పాట ఒకటి వుందట. ఈ పాటను ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. 'మహర్షీ' అంటూ సాగే టైటిల్ సాంగ్ ఇది.
అమెరికాలో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్త, మహర్షిగా మారి, గ్రామానికి వెలుగు నింపేవాడిగా మారిన క్రమంలో జనం అతనికి జేజేలు పడుతూ పట్టే పాటగా ఇది సినిమాలో కనిపిస్తుందని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి మార్కు ఏవిధంగా వుంటుందో చూడాలిమరి.