దిల్ రాజు బ్యానర్ లో చేయని హీరో లేరు. బాహుబలి హీరో ప్రభాస్ కూడా ఎర్లీ స్టేజ్ లో మున్నా సినిమాను వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఆ బ్యానర్ లోనే చేసాడు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు. బాహుబలి లెవెల్ నుంచి సాహో లెవెల్ కు వెళ్లిపోయింది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ తో మళ్లీ మరో సినిమా చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కన్నడనాట భారీ సినిమాగా తెరకెక్కింది కేజీఎఫ్. ఆ సినిమాలో కథ సంగతి ఎలా వున్నా, హీరో ఎలివేషన్, సన్నివేశాల భారీతనం, గ్రిప్పింగ్ గా సాగిన కథనం అన్నీ డైరక్టర్ ప్రశాంత్ నీల్ స్టామినాను తెలియ చెప్పాయి. సో, ప్రశాంత్ నీల్ ను ప్రభాస్ ను జతకలిపితే ఎలా వుంటుంది అన్న ఆలోచన దిల్ రాజు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రశాంత్ నీల్ వెళ్లి హీరో ప్రభాస్ తో ఓ క్యాజువల్ భేటీ వేసారు. దానివెనుక దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కనుక మాంచి సబ్జెక్ట్ తో ప్రభాస్ ను ఒప్పించగలిగితే, ఎంతయినా పెట్టి ప్రొడక్షన్ చేసేందుకు దిల్ రాజు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు ఓకె అయితే మళ్లీ తెలుగులో మరో రెండువందల కోట్ల సినిమాకు అంకురార్పణ జరిగినట్లే. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాను, అలాగే రాధాకృష్ణ డైరక్షన్ లో మరో సినిమాను సమాంతరంగా ఫినిష్ చేసే పనిలో వున్నారు. 2020లో ప్రభాస్ దిల్ రాజుకు దొరికే అవకాశం వుంది.