‘కల్కి’శేఖరుడు

గరుడవేగ తరువాత ప్రశాంతంగా, టైమ్ తీసుకుని మరీ వెటరన్ హీరో రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. స్క్రిప్ట్ డాక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. కల్కి సినిమాకు మొదటి నుంచీ వైవిధ్యంగా ప్రచారం…

గరుడవేగ తరువాత ప్రశాంతంగా, టైమ్ తీసుకుని మరీ వెటరన్ హీరో రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. స్క్రిప్ట్ డాక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. కల్కి సినిమాకు మొదటి నుంచీ వైవిధ్యంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. టైటిల్ దగ్గర నుంచి ప్రతీదీ ఓ కాన్సెప్ట్ తో వుండేట్లు చూసుకుంటున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా అలాగే వుంది. అడ్డంగా వున్న పేపర్ కాలిపోతూ వుంటే పోస్టర్ లోని ఒక్కోపార్ట్ బయటకు వస్తూ, చివరకు టోటల్ పోస్టర్ బయటకు వస్తుంది. జీపులో స్టయిల్ గా కూర్చున్న హీరో రాజశేఖర్ అన్నది టోటల్ పోస్టర్ సారాంశం. అయితే అందులో గమ్మత్తు ఏమిటంటే విష్ యు హ్యాపీ న్యూఇయర్ 2019 అన్నది అలా అలా వెనక్కు వెళ్లి ఆఖరికి 1983 దగ్గర ఆగడం.

ఆ విధంగా పీరియాడిక్ సినిమా అని చెప్పకనే చెప్పినట్లు అయింది. కల్కి అవతారం పరమార్థమే దుష్ట శిక్షణ. మరి ఈ కల్కిగా రాజశేఖర్ చేసేదీ అదే అయివుంటుంది. మరి దానికి 1983 బ్యాక్ డ్రాప్ ఏమిటో సినిమాలోనే తెలుస్తుందేమో?

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు