‘అవును’ మళ్లీ మరో దెయ్యం సినిమా

అనసూయ, అవును.. అవును 2 ఇలా 'అ' అక్షరం మీద సినిమాలు చేస్తూ వస్తున్న నటుడు కమ్ డైరక్టర్ రవిబాబు మళ్లీ మరో ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒకటి రెండేళ్ల పాటు…

అనసూయ, అవును.. అవును 2 ఇలా 'అ' అక్షరం మీద సినిమాలు చేస్తూ వస్తున్న నటుడు కమ్ డైరక్టర్ రవిబాబు మళ్లీ మరో ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నారు. ఆ మధ్య ఒకటి రెండేళ్ల పాటు చెక్కిన 'అదిగో' సినిమా అదిగో అంటే చూడ్డానికైనా కనిపించనంతగా, వేగంగా థియేటర్లలోంచి వెళ్లిపోయింది.

ఇప్పుడు మళ్లీ తనకు కలిసి వచ్చిన దెయ్యం జోనర్ లోనే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. పేరు 'ఆవిరి'. ఈ సినిమా ఫస్ట్ లుక్ కింద, బాటిల్లో బంధించిన ఆత్మ స్టిల్ ను రవిబాబు వదిలారు. అవును సినిమాతో మాంచి హిట్ కొట్టి, దెయ్యం సినిమాలో కాస్త రొమాన్స్ మిక్స్ చేసాడు. అవును 2 చేసినా, ఆ రేంజ్ కు వెళ్లలేదు. 

ఇప్పడు ఆవిరి అంటూ చేస్తున్న సినిమా ఎలా వుంటుందో? చూడాలి. విజయం కోసం చూస్తున్న రవిబాబు ఆశలు ఆవిరి కాకుండా నిలబెడుతుందేమో? చూడాలి.

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు