బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన మొత్తానికి బయటకు వచ్చింది. అందులో కొత్త విషయం ఏదన్నా వుందీ అంటే బ్యానర్ అన్నదే. గీతా బ్యానర్ నా? హారిక హాసిని బ్యానర్ నా? లేదా రెండు కలిసినా? అన్న అనుమానాలు ఇన్నాళ్లు వున్నాయి. ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. రెండూ కలిసి నిర్మిస్తాయి అని.
అయితే హిందీ సినిమా రీమేక్ ప్రయత్నం సెట్ కాలేదు. అందువల్ల వేరే స్క్రిప్ట్ తయారీలో వున్నారని వార్తలు వున్నాయి. ఇంకా అది రెడీ అయ్యే దశలోనే వుందని వినిపిస్తోంది. అయితే లైన్ ఏమిటన్న దానిపై కొంత నమ్మకమైన సమాచారం మాత్రం వుంది.
బన్నీ కోసం త్రివిక్రమ్ తయారు చేసినది తండ్రీ కొడుకుల సబ్జెక్ట్ అని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల సబ్జెక్ట్ నే కానీ, అదేంటీ అన్నది ఇంకా పూర్తిగా తెలియదు. గతంలో త్రివిక్రమ్-బన్నీ కలిసి చేసింది సన్నాఫ్ సత్యమూర్తి. ఓ విధంగా తండ్రి కొడుకుల సబ్జెక్ఠ్ నే. అత్తారింటికి దారేది.. తండ్రీ కూతుళ్ల మధ్య.. అరవింత సమేతలోనూ తండ్రి పాత్ర కీలక మలుపుతోనే కథ ప్రారంభం.. అజ్ఞాతవాసిలో ఓ తండ్రి ప్లాన్ బి అన్నది కీలకం.
అంటే తనకు నచ్చిన, అలవాటైన తండ్రీ కొడుకుల పాత్రల కాన్ ఫ్లిక్ట్ లేదా, రిలేషన్ తోనే మరో మాంచి సబ్జెక్ట్ తయారుచేసినట్లు తెలుస్తోంది బన్నీ కోసం.