టాలీవుడ్ లో ఓ ఇంపార్టెంట్ డేట్ వస్తోంది అంటే హడావుడి ఓ లెవెల్లో వుంటుంది. ఫస్ట్ లుక్ లు, టీజర్ లు, ట్రయిలర్లు ఇలా ఎవరికి వారు తారాజువ్వలు, పటాసులు వదులుతారు. అభిమానులు కూడా ఎదురుచూస్తుంటారు. కానీ 2019 న్యూ ఇయర్ సందర్భంగా పెద్దగా టాలీవుడ్ హడావుడి ఏమీ కనిపించలేదు. వినిపించలేదు. ప్రకటించలేదు.
బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రకటన వచ్చింది. అది తెలియంది కాదు. మూడునెలల బట్టి వార్తల్లో నాని, నాని, నానిపోయిన వార్తే. కనీసం ఓ టైటిల్ లేదు. ముహుర్తం లేదు, లుక్కు లేదు. కిక్కు లేదు.
నాని జెర్సీ ఫస్ట్ లుక్ వచ్చింది. అది కూడా మరీ ఎగ్జయిటింగ్ గా ఏమీలేదు.
మహేష్ మహర్షి స్టిల్ వచ్చింది. ఇది మాత్రమే ఈ న్యూ ఇయర్ మెయిన్ అట్రాక్షన్ అనుకోవాలి. మహేష్ రొటీన్ హెయిర్ స్టయిల్ తో కాకుండా కొత్తగా వున్నాడు.
విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ముస్తాబు వైనం ఎలా వుందో?
సైరా మెగాస్టార్ నుంచి మంచి ముచ్చటరాలేదు.
నిఖిల్ ముద్ర డేట్ రాలేదు.
రాజ్ తరుణ్ సినిమా ప్రకటన లేదు.
నితిన్ ఏం చేయబోతున్నాడో తెలియదు.
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, అఖిల్ అండ్ కో రాజమౌళి కొడుకు పెళ్లిలో బిజీ అయిపోయారు.
చైతూ-సమంత ఓ రోజు ముందుగానే పలకరించేసారు.
మొత్తంమీద ఈసారి న్యూ ఇయర్ కు పెద్దగా సినిమా హడావుడి కనిపించలేదు. ముగ్గురు మెయిన్ హీరోలు పెద్ద ప్రాజెక్టుల్లో లాక్ అయిపోవడం, ఓ హీరో సినిమా అలా వార్తల్లోనే నానుతూ వుండడం, ఇలా రకరకాల కారణాలు. కానీ ఇయర్ ఎండింగ్ సూపర్ ఈవెంట్ గా రాజమౌళి కొడుకు పెళ్లి మిగిలిపోయింది.