చిన్న సినిమాలో పెద్ద హిట్ అన్నంత లేపోయినా, డీసెంట్ హిట్ అనిపించుకుంది 'హుషారు' బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా మరీ ఊపేయకున్నా, అలా స్టడీగా ముందుకు వెళ్తోంది. వారానికీ వారానికీ థియేటర్లు పెంచుకుంటూ మూడోవారంలోకి ఎంటర్ అయ్యేసరికి 125 థియేటర్లలో హుషారుగానే వుంది.
టోటల్ త్రీ వీక్స్ రన్ లో హుషారు సాలిడ్ గా ఏడున్నర కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాగించడం విశేషం. పైగా ఆడుతున్న థియేటర్లలో 99శాతం షేర్ మీద రన్ అవుతున్నవే. రెంటల్స్ కాదు. దానివల్ల షేర్ కూడా స్టడీగానే వుంది.
వాస్తవానికి హుషారు సినిమా సింగిల్ థియేటర్ల కన్నా మల్టీ ఫ్లెక్స్ లో బలంగా వుండడం విశేషం. అదే విధంగా ఆంధ్రలో కన్నా నైజాంలో హుషారుగా వుంది. మొత్తంమీద రెండుకొట్ల పాతికలక్షల బడ్జెట్ తో వచ్చిన హుషారు నిర్మాతకు బాగానే లాభాలు పండించింది. డిజిటల్, శాటిలైట్ అయిపోతే, అర్థరూపాయికి రూపాయి వచ్చినట్లే.