డిసెంబర్ బాక్సాఫీస్: 18 ఫ్లాపులు

ఈ ఏడాదికి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరైన ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయింది. వారానికి మినిమం 4 సినిమాలు చొప్పిన మొత్తంగా 19 సినిమాలు రిలీజ్ అయితే దాదాపు అన్నీ నిరాశపరిచాయి. అంచనాలతో వచ్చిన…

ఈ ఏడాదికి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరైన ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోయింది. వారానికి మినిమం 4 సినిమాలు చొప్పిన మొత్తంగా 19 సినిమాలు రిలీజ్ అయితే దాదాపు అన్నీ నిరాశపరిచాయి. అంచనాలతో వచ్చిన అంతరిక్షం, పడి పడి లేచె మనసు సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి. శ్రీకాంత్ నటించిన ఆపరేషన్-2019తో డిసెంబర్ బాక్సాఫీస్ షురూ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక ఫస్ట్ వీక్ లో సుబ్రహ్మణ్యపురం, నెక్ట్స్ ఏంటి, శుభలేఖలు, కవచం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో భారీ అంచనాల మధ్య విడుదలైన కవచం, ఓ మోస్తరు అంచనాల మధ్య వచ్చిన సుబ్రహ్మణ్యపురం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక తమన్న-సందీప్ కిషన్ కలిసి చేసిన నెక్ట్స్ ఏంటి, శుభలేఖలు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

రెండోవారంలో కూడా 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో వర్మ ఊదరగొట్టిన భైరవగీత కూడా ఉంది. కానీ వర్మ సినిమాల రిజల్ట్ సంగతి తెలిసిందే కదా. ఆర్జీవీ సమర్పకుడిగా వ్యవహరించిన భైరవగీతతో పాటు అనగనగా ఓ ప్రేమకథ లాంటి సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి.

డిసెంబర్ మొత్తానికి ఆశలు పెట్టుకున్న సినిమాలు రెండంటే రెండు మాత్రమే. అవే అంతరిక్షం, పడి పడి లేచె మనసు చిత్రాలు. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి ఈ రెండు సినిమాల్లో పడి పడి లేచె మనసు సినిమా విడుదలైన మొదటిరోజే అట్టర్ ఫ్లాప్ అయింది. శర్వానంద్-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పూర్తిగా నెగెటివ్ రివ్యూస్ పొందింది.

ఇక వరుణ్ తేజ్ చేసిన అంతరిక్షం సినిమా మంచి ప్రయత్నం అనిపించుకున్నప్పటికీ.. కథ, కథనాల విషయంలో నిరాశపరిచింది. అయితే ఈ రెండు సినిమాలతో పాటు అదేవారంలో వచ్చిన కేజీఎఫ్ మాత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. డిసెంబర్ లో కాస్తోకూస్తో వసూళ్లు సాధించిన సినిమా ఏదైనా ఉందంటే అది యష్ నటించిన కేజీఎఫ్ మాత్రమే.

ఈ ఏడాదికి చివరి వారమైన డిసెంబర్ 28న వచ్చిన సినిమాలు కూడా ఫ్లాపులుగానే నిలిచాయి. సుమంత్ చేసిన ఇదంజగత్, సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ సినిమాలతో పాటు ఇష్టంగా, మంచు కురిసే వేళలో, మై డియర్ మార్తాండ సినిమాలన్నీ ఫ్లాపులుగా నిలిచాయి. ఓవరాల్ గా డిసెంబర్ నెలలో కేజీఎఫ్ మాత్రం ఫర్వాలేదనిపించుకుంది.

న్యూ ఇయర్ స్పెషల్ చదవండి ఈ వారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు